ప్లాన్ రూ.1,799..
ఎయిర్టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,799తో ప్రారంభమవుతోంది. ఈ ప్లాన్ సెకండరీ SIM కార్డుని రెగ్యులర్‌గా వాడేవారికి, తరచుగా రీఛార్జ్ చేయకూడదు అనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో 5G నెట్వర్క్ అందుబాటులో ఉంది. మీ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉంటే మీరు హైస్పీడ్ ఇంటర్నెట్ను ఆస్వాదించొచ్చు.
ప్లాన్ రూ.2,999..
ఎయిర్టెల్ అందించే రెండో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2999. దీనికి కూడా ఏడాది వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజు 2GB వరకు డేటా లభిస్తుంది. దీని ప్రకారం ఏడాదికి మొత్తం 730GB వరకు అందిస్తుంది. ఈ ప్లానులో రోజుకు 100 SMSలు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్ బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్ ఇంకా వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలగనున్నాయి.
ప్లాన్ రూ.3359..
ఎయిర్టెల్ అందించే అత్యుత్తమ ఖరీదైన ప్లాన్స్‌లో రూ.3359 ఒకటి. ఈ ప్లాన్‌లో ఏడాది వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజు 2.5GB డేటాను అందించనుంది. ఈ ప్లాన్‌తో మొత్తం 912.5GB డేటా పొందొచ్చు. ఈ ప్లాన్‌తో భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
అదనపు ప్రయోజనాలు..
రూ.3359 రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 100 SMSలు ఉచితంగా అందిస్తుంది. అలాగే 5G డేటా కూడా లభిస్తుంది. అంతేకాదు ఒక సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ ఫోన్ సబ్స్క్రిప్షన్, మూడు నెలల పాటు అపోలో 24/7, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ పై రూ.100 క్యాష్ బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ యాక్సెస్‌లను కూడా అందిస్తుంది.