గిరిజన యువకుడిని కొట్టి చంపిన కేసులో 14మందికి జైలు శిక్ష
గిరిజన యువకుడిని కొట్టి చంపిన కేసు(Tribal Man Lynching Case )లో 13 మంది దోషుల(Convicts)కు..
![Tribal Man Lynching Case: గిరిజన యువకుడిని కొట్టి చంపిన కేసులో 14మందికి జైలు శిక్ష](https://media.andhrajyothy.com/media/2023/20230317/Untitled_4_a17797c6cc_V_jpg--799x414-4g.webp)
పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెనోన్( Public Prosecutor Rajesh M Menon) తెలిపిన వివరాల ప్రకారం..2018 ఫిబ్రవరిలో పాలక్కాడ్ జిల్లా(Palakkad District)లోని అట్టపాడి(Attapadi)లో దొంగతనం చేశాడని ఆరోపిస్తూ అడవుల్లో జీవించే మధు అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కొట్టి చంపారు. మొత్తం 14 మంది నిందితులను దోషులుగా కోర్టు గుర్తించింది. ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. మొదటి నిందితుడు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ 304 (2) సెక్షన్ (1) (డి) కింద నేరానికి పాల్పడినట్లు రుజువైంది. బాధితుడిని ఉద్దేశపూరితంగా, చట్టవిరుద్ధంగా హత్యకు పాల్పడినందుకు 14 మందిని దోషులుగా తేల్చింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది.