కీళ్ల నొప్పుల (Joint pain)కు ఫిజియోథెరపీ (Physiotherapy), పెయిన్ కిల్లర్స్‌తో దక్కే ఉపశమనం అంతంత మాత్రమే! అలాగని ఏకంగా కీళ్ల మార్పిడినీ ఆశ్రయించలేం! మరి అలాంటప్పుడు
Joint pain
కీళ్లలో ఇన్ఫ్లమేషన్ తలెత్తడం వల్ల ఎముకల మధ్య జాగా తగ్గిపోయి, ఎముకలు రెండూ రాసుకుని నొప్పి మొదలవుతుంది. అయితే బరువు పెరగడం వల్ల, పెరిగే వయసు వల్ల కీళ్లు అరిగిపోవడమనేది సహజం. అయితే ఇలా కీళ్లు అరిగిపోవడానికి ప్రధాన కారణం ఇన్ఫ్లమేషన్. కీళ్లలో ఈ వాపుకు కారణం ఆ ప్రాంతంలో వ్యాస్క్యులర్ గ్రోత్ ఎండోథీలియల్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్ విడుదలవడమే! ఈ ప్రొటీన్ వల్ల కొత్త సూక్ష్మ రక్తనాళాలు ఏర్పడి, అవి పగిలి, రక్తం గూడుకట్టుకుని, దాని చుట్టూరా క్యాలస్ అనే అదనపు ఎముక పెరుగుతుంది. ఇలా ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే రక్తనాళాన్ని మోయా మోయా రక్తనాళం అంటారు. ఇలా అదనపు ఎముక పెరుగుదల వల్ల కీలు ఆకారం మారిపోయి, కీళ్ల మధ్య జాగా మరింత తగ్గుతూ, ఎముకా ఎముకా రాసుకునే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి కీళ్ల ఆర్థ్రయిట్ఢిస్కు ప్రధాన కారణాన్ని ఇన్ఫ్లమేషన్గానే భావించాలి. కొన్ని సందర్భాల్లో రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ అనే ఇన్ఫ్లమేటరీ వ్యాధి, యూరిక్ యాసిడ్ డిపొజిషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ మొదలవవచ్చు. అలాగే పెరిగే వయసు వల్ల కూడా కీళ్ల మధ్య ఇన్ఫ్లమేషన్ తలెత్తవచ్చు.
ప్రత్యామ్నాయ చికిత్సగా…
అయితే ఎలాంటి కీళ్ల నొప్పికైనా ప్రారంభంలో ఫిజియోథెరపీ, నొప్పి తగ్గించే మందులనే వైద్యులు సూచిస్తారు. వీటితో నొప్పి అదుపు కానప్పుడు, కీళ్లు అరుగుదల నాలుగో దశకు చేరుకున్నప్పుడు మాత్రమే వైద్యులు కీళ్ల మార్పిడి చికిత్సను సూచిస్తూ ఉంటారు. కానీ ముందు మూడు దశల్లో కూడా నొప్పి తట్టుకోలేనంతగా ఉంటుంది. అలాంటి వాళ్లు ఈ చికిత్సను ఆశ్రయించవచ్చు. అలాగే కీళ్ల మార్పిడి దశకు చేరుకున్న ప్రతి ఒక్కరికీ కూడా ఆ చికిత్స వీలుపడకపోవచ్చు. హృద్రోగులు, మధుమేహులు, ఇతరత్రా తీవ్ర వ్యాధులున్నవాళ్లకు కీళ్ల మార్పిడి సాధ్యపడకపోవచ్చు. అలాగే చిన్న వయసులోనే కీళ్లు అరిగిపోయిన వాళ్లు, క్రీడాకారులు కూడా నేరుగా కీళ్ల మార్పిడి చేయించుకునే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, నొప్పిని మటుమాయం చేసే అత్యాధునిక చికిత్సా విధానమైన ఇంట్రా ఆర్టీరియల్ ఎంబొలైజేషన్ చికిత్సా విధానాన్ని ఆశ్రయించాలి.
చికిత్స ఇలా సాగుతుంది
మోకీళ్ల నొప్పుల కోసం యాంజియోగ్రామ్ పద్ధతిలో తొడ దగ్గరి శిర నుంచి నీడిల్‌ను పెట్టి, నీడిల్ ద్వారా వైరును పంపించి మోకీలులో ఏర్పడిన క్యాల్సకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలోకి చేరుకుని, ఎక్కవ మోతాదుతో కూడిన యాంటీబయాటిక్ (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మందును ఇంజెక్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పార్టికల్స్‌ను కూడా ఇంజెక్ట్ చేయవలసిన అవసరం రావచ్చు. ఈ మందులతో ఇన్ఫ్లమేషన్ వెంటనే తగ్గిపోయి, ఏడాది నుంచి ఆరేళ్ల వరకూ తిరగబెట్టకుండా ఉంటుంది. ఆర్థ్రయిటి్‌సకు దారి తీసిన, కొత్తగా పెరిగిన, అసాధారణమైన రక్తనాళంలోకి మాత్రమే మందును ఎక్కించడం జరుగుతుంది. కాబట్టి మిగతా రక్తనాళాలన్నీ సురక్షితంగా ఉంటాయి. మందు ఇచ్చిన తర్వాత రక్తనాళం పనితీరు మందగించి, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి, నొప్పి నుంచి సత్వరం ఉపశమనం కలుగుతుంది.
సత్వర ఉపశమనం
చికిత్స మొత్తం యాంజియోగ్రాఫ్ పద్ధతిలో సాగుతుంది కాబట్టి శరీరం మీద కోతలూ, కుట్టూ ఉండవు. చికిత్స 15 నిమిషాల నుంచి అరగంటలో పూర్తయిపోతుంది. అనస్థీషియా ఇవ్వవలసిన అవసరం కూడా ఉండదు. చికిత్స చేస్తున్న సమయంలోనే నొప్పి అదుపులోకొస్తుంది. చికిత్స పూర్తయిన వెంటనే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. నొప్పి పూర్తిగా తగ్గిపోవడానికి రెండు నుంచి మూడు వారాలు పట్టవచ్చు. నొప్పి తగ్గిపోతుంది కాబట్టి ఫిజియోథెరపీతో కీళ్లను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఈ చికిత్సతో ఒకటి నుంచి ఆరేళ్ల పాటు ఉపశమనం దక్కుతుంది. ఏ సమస్య వల్ల మోకీళ్ల మార్పిడి అవసరమవుతుందో, ఆ కారణాన్ని ఇంట్రా ఆర్టీరియల్ ఎంబొలైజేషన్ చికిత్సతో నెమ్మదించవచ్చు. మోకీళ్ల విషయానికొస్తే, ఆ నొప్పులకు అంతిమంగా మోకాలి మార్పిడి చికిత్సలున్నాయి. కానీ భుజాల కీళ్ల అరుగుదలకు ఫిజియోథెరపీ మినహా ఎటువంటి చికిత్సలూ లేవు. మధుమేహులైన మహిళల్లో 20 శాతం మంది ఫ్రోజెన్ షోల్డర్తో బాధపడుతూ ఉంటారు. చేతిని పైకీ, వెనకకూ కదిలించలేకపోవడం, నొప్పీ ఈ సమస్య లక్షణాలు. ఈ సమస్య ఉన్నవాళ్లకు చేతిలోని రక్తనాళం ద్వారా సమస్య ఉన్న ప్రాంతంలోని రక్తనాళాల్లోకి మందును ఇంజెక్ట్ చేయవచ్చు. దాంతో నొప్పి నుంచి ఉపశమనం కలగడంతో పాటు, కదలికలు కూడా పెరుగుతాయి. అలాగే మడమ శూల అనే ప్లాంటార్ ఫాసియైుటిస్ సమస్యకు మడమలోని ఆర్టెరీకి చికిత్స చేయడం ద్వారా ఉపశమనాన్ని అందించవచ్చు. అలాగే చేతి వేలి కీళ్ల నొప్పులకు కూడా ఇదే విధంగా చికిత్స చేయవచ్చు. అలాగే గోల్ఫర్స్ ఎల్బో, టెన్నిస్ ఎల్బో లాంటి స్పోర్ట్స్ గాయాలకు కూడా ఈ చికిత్స తోడ్పడుతుంది.