కె.కోటపాడు,ఏప్రిల్04(ఆంధ్రపత్రిక):
మండలంలోని కింతాడ పంచాయతీ శివారు గొల్లలపాలెం గ్రామంలో భక్తిశ్రద్ధలతో మంగళవారం వైభవంగా జరిగిన శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ మహోత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి, మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. బొట్టవారి కుటుంబీకుల దేవుడిళ్ళులో శ్రీ పైడితల్లమ్మ అమ్మవారిని అయన దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను డిప్యూటీ సీఎం ఆసక్తిగా తిలకించారు. పండగ కమిటీ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జగన్ రెడ్డి జగన్ మోహన్, కింతాడ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ఎంపిటిసి సభ్యురాలు పల్లా కన్నమ్మ ప్రతినిధి పల్లా రాజేశ్వరరావు, చౌడువాడ ఎంపీటీసీ సభ్యులు ఏటుకూరు రాజేష్, ఆర్.బి.కె.చైర్మన్ బండారు అక్కన్నపాత్రుడు, వైసిపి నాయకులు బండారు రామస్వామిపాత్రుడు, గొర్రుపోటు వెంకటరావు, ఆదిరెడ్డి రామునాయుడు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.