కాలువల్లో పూడిక తొలగింపు.
ముమ్మరంగా చేపడుతున్న పారిశుధ్యం పనులు.
హర్షం వ్యక్తం చేస్తున్న వావిలపాడు గ్రామస్తులు.
వేపాడ,ఏప్రిల్,3(ఆంధ్ర పత్రిక):-మండలంలోని వావిలపాడు గ్రామంలో పారిశుధ్యం పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.గ్రామంలోని అన్ని వీదుల్లోని కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింపునకు సోమవారం శ్రీకారం చుట్టారు. కాలువల్లో మురుగునీటి నిల్వలు అనే శీర్షికన ఈనెల 3న ప్రచురితమైన వార్తకు స్పందించిన వావిలపాడు పంచాయితీ ఇంచార్జి కార్యదర్శి కన్నంనాయుడు యుద్ధప్రాతిపదికన గ్రామంలో పారిశుధ్యం పనులకు శ్రీకారం చుట్టారు.కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించడం, కాలువలను, సీసీరోడ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం,దోమల బారినుండి ప్రజల రక్షణకోసం బ్లీచింగ్ పౌడర్ జల్లడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి కన్నంనాయుడు మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వీదులను పరిశుభ్రంగా తీర్చిదిద్ది ప్రజారోగ్యం ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!