ఫోర్ట్కాంప్బెల్(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
పోర్ట్ కాంప్‌బెల్‌కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది.
101 ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన హెచ్‌హెచ్-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రెండూ రాత్రి వేళ జరుగుతున్న రోజువారీ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంత అటవి, కొంతమైదానం ఉన్నాయని కెంటకీ గవర్నర్ ఆండీ చెప్పారు.