శ్రీలంక, పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లకు రెండు వెర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు.కాగా ఈ రెండు సిరీస్‌లకు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ దూరమయ్యారు. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు వీరిద్దరూ భారత్‌కు రానుండడంతో ఈ సిరీస్‌లకు దూరమయ్యారు.ఇక ఈ రెండు సిరీస్‌లకు కివీస్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. అదే విధంగా చాడ్ బోవ్స్, షిప్లీ తొలి సారి న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా న్యూజిలాండ్ స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
ఏప్రిల్ 2న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం కివీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో కివీస్ ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి 24 వరకు జరగనుంది.
శ్రీలంక సిరీస్‌కు కివీస్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్.
పాకిస్తాన్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. డేన్ క్లీవర్, కోల్ మెక్‌కాన్చీ, బ్లెయిర్ టిక్నర్.