World Record : సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగ్గా.. పరుగుల వరద పారింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మైదానంలో ఎడాపెడా బౌండరీలు బాదేశారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super gaints)కు తీపి కబురు అందింది. గత కొంత కాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న స్టార్ ప్లేయర్ సరిగ్గా మెగా టోర్నీ ముందుకు ఫామ్ లోకి వచ్చాడు.సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ గత కొంత కాలంగా ఫామ్ లో లేడు. వరుసగా విఫలం అవుతున్నాడు. అయితే వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20లో క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడుడికాక్ సూపర్ షోతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సౌతాఫ్రికా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో ఏకంగా 259 పరుగుల లక్ష్యాన్ని చేధించి, అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగ్గా.. పరుగుల వరద పారింది.ఇరుజట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మైదానంలో ఎడాపెడా బౌండరీలు బాదేశారు. తొలుత వెస్టిండీస్ జట్టు 258 పరుగులు చేస్తే.. తామూ ఏం తక్కువ తినలేదన్నట్టుగా సౌతాఫ్రికా ఆటగాళ్లు రెచ్చిపోయి, ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించేశారు.మొదట టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు వెస్టిండీస్ రంగంలోకి దిగింది. మైదానంలో అడుగుపెట్టిన కొన్ని సెకన్లలోనే వెస్టిండీస్ జట్టుకి దెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కానీ.. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. కైల్ మేయర్స్ (57), జాన్సన్ చార్ల్స్ (118) కలిసి సౌతాఫ్రికా బౌలర్లపై తాండవం చేశారు.చార్ల్స్ అయితే పూనకం వచ్చినట్టు.. ఒకటే బాదుడు బాదేశాడు. 39 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడంటే, అతడు ఏ రేంజ్లో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. చివర్లో వచ్చిన షెఫర్డ్ (41) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. వెస్టిండీస్ నిర్దిష్ట 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇక సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 3, వేన్ పార్నెల్ 2 వికెట్లు తీశారు.ఆ తర్వాత 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆ లక్ష్యాన్ని చేధించి, అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (100) శతక్కొట్టగా.. రీజా హెండ్రిక్స్ (68) సైతం శివమెత్తినట్టు ఆడాడు. వీళ్లిద్దరి విధ్వంసం కారణంగా.. 10.5 ఓవర్లోనే సౌతాఫ్రికా జట్టు 152 పరుగులు చేసేసింది. వెస్టిండీస్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. వీళ్లు పరుగుల సునామీ సృష్టించారు.చివర్లో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (38 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (16 నాటౌట్) జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, స్మిత్, రీఫర్, పావెల్ తలా వికెట్ తీశారు. టీ20 చరిత్రలో ఇదే హయ్యస్ట్ ఛేజింగ్. ఇంతకుముందు 2018లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌పై 245 పరుగులు చేసి విజయం సాధించగా.. ఆ రికార్డ్‌ని సౌతాఫ్రికా తాజా మ్యాచ్‌తో బ్రేక్ చేసేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!