IPL 2023 : మరో 5 సార్లు ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది. 13 సీజన్లలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. 11 సీజన్లలో ప్లేఆఫ్స్ కు చేరుకుందంటే ఆ జట్టు ఎంత నిలకడైన ఆటను ప్రదర్శిస్తుందో ఇట్టే చెప్పొచ్చు.మరో 5 సార్లు ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది. 13 సీజన్లలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. 11 సీజన్లలో ప్లేఆఫ్స్ కు చేరుకుందంటే ఆ జట్టు ఎంత నిలకడైన ఆటను ప్రదర్శిస్తుందో ఇట్టే చెప్పొచ్చు.ఇక చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ధోని లీడర్ షిప్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నాడు. కెప్టెన్సీ విషయంలో ధోని దరిదాపుల్లోకి వచ్చే మరో ప్లేయర్ లేడంటూ వ్యాఖ్యానించాడు. ఇందుకు ఇక ఉదాహరణ కూడా ఇచ్చాడు2013 స్పాట్ ఫిక్సింగ్ కలకలం తర్వాత.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరోపణలు వచ్చాయి. దాంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్ల నుంచి చెన్నై, రాజస్తాన్ రాయల్స్ పై బీసీసీఐ వేటు వేసింది.దాంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెల్లా చెదురైంది. రెండేళ్ల పాటు కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగింది. అనంతరం 2018లో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.పునరాగమనంలో ఆడుతున్న తొలి సీజన్ (2018)లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చాంపియన్ గా నిలిచి సత్తా చాటింది. ఇదే ధోనిని ప్రత్యేకంగా నిలబెట్టిందంటూ సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.రెండేళ్ల పాటు చెన్నై ప్లేయర్లు వేరే వేరే ఫ్రాంచైజీలకు ఆడారని.. అయితే 2018లో వీరందరూ మళ్లీ చెన్నూ గూటికి చేరుకున్నారని గావస్కర్ పేర్కొన్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఆడుతున్నా ప్లేయర్లందరినీ ఒక జట్టుగా ధోని నడిపిన తీరు అమోఘం అంటూ గావస్కర్ వ్యాఖ్యానించాడు.ఇక ఆ ఏడాది ఒక మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న ధోని తన మార్కు బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడని గావస్కర్ గుర్తు చేశాడు. కష్ట సమయాల్లో కెప్టెన్ హోదాలో ధోని ముందుండి నడిపించడంతో ఇతర ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. అందుకే ఆ ఏడాది చెన్నై మరోసారి చాంపియన్ గా నిలిచిందంటూ గావస్కర్ పేర్కొన్నాడు.