గ్యా,పెట్రో ధరలపై ప్రజల ఆగ్రహం
మండిపడ్డ మంత్రి తలసాని
హైదరాబాద్, మార్చి 24 ఆంధ్రపత్రిక : దేశం నుంచి తరిమి కొట్టే వరకు బీజేపీకి బుద్ధిరాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడం ఖాయమని అన్నారు. ఆయా రాష్టాల్ల్రో ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం అలవాటుచేసుకున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని తెలిపారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పేదలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు
దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. రైతులంటే బీజేపీ చీదరించుకుం టోందన్నారు. గతంలో వరి వేయమని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు వడ్లు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు.
ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. టీఆర్ఎస్ చేసిన మంచి పనులు 150కిపైగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికలైన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి, ముబ్బడిగా ధరలు పెంచుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిందన్న ఆయన ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధరల పై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్‌పై మండిపడ్డ ఆయన దమ్ముంటే సమస్యలపై ప్రధాని మోడీని నిలదీయాలని అన్నారు. పేద ప్రజలకు మోడీ సర్కార్ ఏమి చేయలేదని విమర్శించిన మంత్రి..పెద్ద పెద్ద వాళ్లకు రుణమాఫీ చేసింది మోడీ సర్కార్ అని.. అంబానీ, ఆదానీలకు, దేశం విడిచివెళ్లిన విజయ్ మాల్యాకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా ఉద్యమ నిర్మాణం పటిష్టంగా చేస్తే ఈ కేంద్ర సర్కార్ దిగివస్తుందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేద్దామని సూచించారు. దమ్ముంటే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తలసాని డిమాండ్ చేశారు. 2014లో పెట్రోల్ ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్ ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు. ఈ రోజు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!