Rajasthan: రక్తంతో మహిళ శరీరంపై పదుల సంఖ్యలో కత్తి గాయాలు ఉన్నాయి. పూర్తిగా అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరికొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కొందరు భర్తలు.. కట్టుకున్న భార్యలను టార్చర్ పెడుతుంటారు. కట్నం ఎక్కువగా తేలేదని, అందంగా లేదని.. తరచుగా ఇంట్లో గొడవలకు దిగుతుంటారు. మరికొందరు ఇంట్లో భార్యలు ఉండగా ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు (Affairs) పెట్టుకుంటారు. అంతే కాకుండా.. కూరలో ఉప్పువేయలేదని, చికెన్ సరిగ్గా వండలేదని సిల్లి రిజన్స్ తో గొడవలకు దిగి, హత్యలు చేయడం వరకు వెళ్లిన సంఘటనలు కూడా తరచుగా మనం వార్తలలో చూస్తునే ఉంటాం. మరికొందరు కంట్రోల్ చేసుకోలేని కోపంలో భార్యపై ఎంతటి అఘాయిత్యానికి పాల్పడటానికైన వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan) దౌసా జిల్లా లో దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. బైజుపాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతిన్ గ్రామ సమీపంలో గురువారం రక్తపుమడుగులో ఓ మహిళ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
బైజుపాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళను స్థానికంగా.. ధిగారియా కపూర్‌కు చెందిన వినీతా దేవి (23)గా గుర్తించారు. కాగా, వినీతాదేవిని బైక్‌పై కూర్చోబెట్టి భర్త అత్తమామల ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం. అయితే మార్గమధ్యలో ఏంజరిగిందో కానీ.. భర్త ఒక్కసారిగా తన భార్యపై రోడ్డుపైనే అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. కోతీన్ గ్రామ సమీపంలో వినీతపై కత్తితో ఇష్టమోచ్చినట్లు దాడి చేశాడు. నిందితుడు తన వినీత శరీరంపై కత్తితో దాదాపు 15 సార్లు కత్తితో పోడిచాడు. దీంతో మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయింది.
ప్రస్తుతం ఆ మహిళ జైపూర్ SMS ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత.. వినీత భర్త అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ప్రస్తుతం.. అతని కోసం వెతుకుతూ ప్రతి చోటా గాలిస్తున్నారు. ఇప్పటిదాక మహిళ కానీ, ఆమె బంధువుల నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేని స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు.