Summer Tips for Diabetes: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా చేయాలి
ప్రస్తుత ఆధునిక జీవన శైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది డయాబెటిస్. ఈ డయాబెటిస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవొచ్చు.
అందుకే ఈ వ్యాధి పట్ల అప్రమంత్తంగా ఉండాలి.
వేసవి కాలం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరిన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో, రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారింది. కాబట్టి, నియంత్రణకు ఏమి చేయాలి?
బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, సహజంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. డయాబెటిస్ వ్యాదికి నియంత్రణే తప్ప శాశ్వత చికిత్స లేదు. అందుకే వేసవి సీజన్ లో వతగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం వేడి వాతావరణంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిశితంగా పరిశీలించడం మరియు సంభావ్య లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవిలో షుగర్ లెవల్స్ పెరిగిందనడానికి సంకేతాలు
ఈ రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులకు సాధారణ జనాభా కంటే డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంది. డయాబెటిక్ రోగులలో, నిర్జలీకరణం యొక్క కొన్ని సంకేతాలు ఉన్నాయి, వీటిలో అలసట, మూత్రవిసర్జన తగ్గడం, ముదురు రంగు మూత్రం, తక్కువ రక్తపోటు (తక్కువ BP), పెరిగిన హృదయ స్పందన రేటు, అధిక దాహం, మైకము లేదా తేలికపాటి తలనొప్పి, నోరు మరియు కళ్ళు పొడిబారడం మొదలైనవి.
అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ వహించాలి? మీరు వేసవిలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి వేసవిలో ప్రారంభం నుండే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
మెంతి గింజలు మధుమేహానికి ఉత్తమ చికిత్స.
వేసవిలో రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల రోజంతా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు వేసవిలో స్వీట్లు, కార్బోహైడ్రేట్లు మరియు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం మానుకోవాలి. బదులుగా, మరింత తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి.
శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి:వేసవి సీజన్ లో మధుమేహాన్ని నియంత్రించడంలో చురుకుగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతల బారి నుండి కాపాడుకోవడం కీలకం. అందుకోసం ఉదయం, సాయంత్రం 45 నిముషాల నడకు వెళ్ళడం. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకుండా ఉండాలి.
ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి: అధిక ఫైబర్ ఫుడ్ డయాబెటిస్ ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి. ఫైబర్ ఫుడ్స్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి.
జ్యూసులకు బదులు పండ్లు తీసుకోండి:
వేసవి సీజన్ లో తాజా పండ్ల రసాలు, స్మూతీస్, ఇతర రిఫ్రెష్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉండకపోవడం, చక్కెర కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు చాలా త్వరగా పెరుగుతాయి. కాబట్టి రసాల కంటే తాజా పండ్లు తీనడం మంచిది.
ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండండి
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే, మూత్ర పిండాలు అదనపు చక్కెరను వదిలించుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సి విస్తుంది. శరీరం నుండి అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని తయారుచేయాలి. నీరు బాగా తాగితే అది మీ రక్తంలో చక్కెర(గ్లూకోజ్)స్థాయిలను తగ్గించండలో సమాయపడుతుంది. అందువల్ల వేసవిలో నీరు, తేమనిచ్చే ఆహారాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
మామిడి ఆకులు మధుమేహానికి ఔషధం
15 మామిడి ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి రాత్రంతా అలాగే ఉంచి, ఈ నీటిని వడకట్టి ఉదయాన్నే త్రాగాలి. మీరు రోజుకు ఒకసారి వేప పొడిని కూడా తినవచ్చు. దీంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
హెర్బల్ టీ మధుమేహాన్ని నియంత్రించే మార్గం.
వేసవిలో టీ తాగడం మంచిది కాదు కానీ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు ప్లెయిన్ టీకి బదులుగా హెర్బల్ టీ తాగాలి. అల్లం, పసుపు, దాల్చిన చెక్క పొడితో చేసిన హెర్బల్ టీని ఉదయాన్నే తాగవచ్చు.
నిద్ర, యోగా వంటివి కూడా షుగర్ నియంత్రణకు మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి మండూకాసనం, వజ్రాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం వంటి యోగాసనాలను ఆచరించాలి. మీరు కపాలభాతి మరియు ఉజ్జయి వంటి ప్రాణాయామాలను కూడా చేయవచ్చు. అలాగే, ప్రతిరోజూ 7-8 గంటల పాటు మంచి నిద్రను పొందండి.