రాహుల్ వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్ డిమాండ్
ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదా
న్యూఢల్లీి,మార్చి13 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో సెషన్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లండన్‌లో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ ఖండిరచాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందం టూ లండన్‌లో రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బిజెపి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చేయిస్తున్న దాడులు, అదానీ అక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సభలో సభ్యుడైన రాహుల్‌గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను సభలోని సభ్యులందరూ ఖండిరచాలని, దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని ఓ సీనియర్ నేత అవమానించడం సిగ్గు చేటని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడిరది.