కె.కోటపాడు,మార్చి10(ఆంధ్రపత్రిక):ఈనెల12వ తేదీన మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎ.కోడూరు జడ్పీహైస్కూల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రక్తహీనత, గర్భిణుల ప్రసవం వేళ, వివిధ ఆపరేషన్ల వంటి అత్యవసర సమయాల్లో అవసరం మేరకు రక్తం అందించి ప్రాణాపాయం నుంచి రక్షించాలన్న ఆశయంతో రక్తదాన శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలు ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎ.కోడూరు హైస్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్న మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్త దానం చేయాలనుకునే ఆసక్తి కలిగిన అర్హులైన వారు తమను సంప్రదించాలని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొంప వెంకటరావు (9010622201), వైస్ చైర్మన్ సింగంపల్లి అర్జున(8309966963), కార్యదర్శి సింగంపల్లి అచ్చిబాబు(9441107432), సభ్యులు ఆర్.కె.నాయుడు (9493948374) పంపిణీ చేస్తున్న కరపత్రాలలో కోరారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!