పల్నాడు జిల్లా, నాదెండ్ల, మార్చి 7 (ఆంధ్ర పత్రిక) :– నాదెండ్ల గ్రామంలోని శుభోదయం మండల సమైక్య న్యాయ సలహాల కేంద్రం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, శుభోదయం మండల సమైక్య మార్చి 8 మహిళా దినోత్సవంను
పురస్కరించుకొని ముందుగా సోమవారం ఉదయం నాదెండ్ల మండలం ,నాదెండ్ల గ్రామంలో వైయస్సార్ క్రాంతి పదం ఏపిఎం భరత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధికారులు ఎం.ఆర్.ఓ ఎ.వి రవణ, సి.డి.పి.ఓ ప్రవీణ, ఎం.పీ.పీ తల తోటి రాణి, జడ్పి.టి.సి కాట్రగడ్డ మస్తాన్, ఎం.పి.డి.ఓ జాకీర్ హుస్సేన్, ఎం.ఈ.ఓ ఆంజనేయులు, మండల కో ఆప్షన్ సభ్యుడు మూసా, మండల శ్రీనిధి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు.
నాదెండ్ల మండల ఎం.పీ.పీ తల తోటి రాణి మాట్లాడుతూ
ముందుగా మహిళలందరికీ ప్రపంచ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఒకే మనస్తత్వం కలిగి ఉండాలని ఏదైనా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడితే పిల్లల ముందు గొడవ పడకుండా ఉండాలి. అలా చేయడం వల్ల పిల్లల మనస్తత్వం చెడిపోకుండా బాగుపడటానికి దోహదపడతాయన్నారు, ఇది తల్లిదండ్రులుగా మన నైతిక బాధ్యత అని అన్నారు. మరి ముఖ్యంగా ఇప్పటికీ దేశంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ బాల్య వివాహాలు జరగటం వల్ల చిన్న వయసులో ఆ బాలికలు రక్తహీనతకు గురవడం జరుగుతుంది. ఈ రక్తహీనత వల్ల ఆరోగ్యం దెబ్బతిని వారు మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన మహిళలు ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ బాలికను కాపాడాలి.ఆడపిల్లను కాపాడుదాం, భవిష్యత్ తరాన్ని కాపాడుకుందాం అని అన్నారు.
నాదెండ్ల మండల జడ్పి.టి.సి కాంట్రగడ్డ మస్తాన్
మాట్లాడుతూ..
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారు. ఎందుకంటే ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి విడదల రజిని ఒక మహిళ, మన నాదెండ్ల మండలం ఎమ్మార్వో ఒక మహిళ, సి.డి.పి.ఓ ఒక మహిళ ,ఎం.పీ.పీ ఒక మహిళ కావటం ఎంతో గర్వకారణం అని అన్నారు. మహిళలలు ఏ విషయంలోనైనా పురుషుల కంటే తక్కువ కాదని నేటి ప్రపంచంలో నిరూపిస్తున్నారు. స్త్రీ లేకపోతే జననం లేదు,
స్త్రీ లేకపోతే గమనం లేదు,
స్త్రీ లేకపోతే జీవం లేదు,
స్త్రీ లేకపోతే సృష్టే లేదు కాబట్టి మనమందరం మహిళలను గౌరవిద్దాం వారి ఆశయాలు సాధించేవరకు ప్రోత్సహిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండలం నాలుగు క్లస్టర్ల డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.