పల్నాడు జిల్లా, చిలకలూరిపేట, మార్చి 7 (ఆంధ్ర పత్రిక):-పట్టణంలోని పసుమర్తి గ్రామంలో నివసిస్తున్న పఠాన్ వజీర్ భాష – మస్తాన్ బి దంపతులకు ఇద్దరు సంతానం కలరు. మొదటి సంతానం అమ్మాయి కాగా, ద్వితీయ సంతానం ఫిరోజ్. ఫిరోజ్ గత సంవత్సరం సెయింట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. ఈ సంవత్సరం పట్టణంలోని ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ పక్కన ఉన్న శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షలు ఆసన్నమైన దశలో నిన్న ఫిరోజ్ కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది. యధావిధిగా గత రాత్రి ఫిరోజ్ ఇంట్లో భోజనం చేసి నిద్రిస్తున్న సమయాన తెల్లవారుజామున గుండె నొప్పి గుండె నొప్పి అని కేకలు వేయడం జరిగింది. ఆ కేకలు విన్న వారి తల్లిదండ్రులు, బంధువులు ఉన్నపలంగా చిలకలూరిపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఫిరోజ్ ను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందాడని తల్లిదండ్రులకు,
బంధువులకు తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!