ఒక్క కంపెనీ కూడా పెట్టుబడి పెడ్డం లేదు
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కానరాని స్పందన
విూడియా సమావేశంలో నారా లోకేశ్
చిత్తూరు,మార్చి 6 (ఆంధ్రపత్రిక):రాష్ట్రంలో 3 శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను 13.5 శాతానికి పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని టిడిపి నేత లోకేశ్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఒక్క అంతర్జాతీయ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదని చెప్పారు. రూ.12 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో దావోస్ కు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానించినా ఏ ఒక్క కంపెనీ కానీ, పెట్టుబడి పెట్టే సంస్థలు గాని ముందుకు రాకపోవజీడం గమనార్హమన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రజా ప్రతినిధులు అనుసరిస్తున్న విధానాలతో విసుగెత్తిన పరిశ్రమల యాజమాన్యాలు, కంపెనీలు ఈ రాష్టాన్న్రి వీడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రాష్టాన్రికి గుడ్ బై చెప్పి పక్క రాష్టాల్రకు వలస పోతున్నాయని, ఫలితంగా యువత ఉపాధి కోల్పోతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర 36వ రోజు సందర్భంగా సోమవారం ఆయన పీలేరు పట్టణ శివారులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తన బినావిూ కంపెనీ ఇండోసోల్ కంపెనీకి 25వేల ఎకరాల భూమిని అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేదలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదేనని నారా లోకేస్ విమర్శించారు. చంద్రన్న భీమా, పెళ్లి కానుక, రంజాన్ తోఫా, దుల్హన్ పధకం, విద్యార్థుల ఫీ రీయంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు లాంటి పథకాలు పూర్తిగా రద్దు చేసి, పేదలకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవతారాన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు తాము పరిశ్రమలను తిరిగి తీసుకొస్తామని హావిూ ఇచ్చారు. అలాగే ఆగిన పేదల సంక్షేమ కార్యక్రమాలను కూడా పునర్ ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్లా రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.