Stevia: షుగర్ రోగులకు గిఫ్ట్.. చక్కెర బదులు స్టీవియా
టీలో షుగర్ వేసుకుని తాగాలని షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం ఉండదా? అలాంటి వారి కోసమే ” స్టివియా” ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది తులసి జాతికి చెందిన మొక్క.
దీని ఆకులు చాలా తియ్యగా ఉంటాయి కనుక.. ఈ మొక్కను మధుపత్రి, తియ్యని మొక్క అని కూడా పిలుస్తుంటారు. స్టీవియా (Stevia) ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కలిగి ఉంటాయి. వీటి నుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార.. స్టీవియా (Stevia) ఆకుల నుంచి తీసిన ఒక స్పూను పంచదారతో సమానం.
ప్రతి పదిమందిలో ఏడుగురు షుగర్ వ్యాధితో బాధపడు తున్నారు. దీనికి కారణం రక్తంలోని షుగర్ లెవెల్స్ లో ఏర్పడే హెచ్చుతగ్గులే. అందుకనే షుగర్ వ్యాధి సోకినవారు తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. మధుపత్రి ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుపత్రి ఆకులతో రక్తపోటు, హైపర్ టెన్షన్, దంతాలు, గ్యాస్, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.