విశాఖలో పారిశ్రామిక వేత్తలకు..
వేడివేడి.. బొమ్మిడాయిల చేపల పులుసు..
విశాఖపట్నంలో ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఈ సమ్మిట్ కోసం హాజరవుతున్నారు. వీరికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన భోజన సదుపాయాన్ని కల్పించనుంది. మన ఆంధ్ర ప్రదేశ్ రుచులను పారిశ్రామికవేత్తలకు పరిచయం చేయనున్నారు. ప్రధానంగా కోడివేపుడు, బొమ్మిడాయిల చేపల పులుసు, ప్రాన్స్ మసాలా, వడియాలు, పలురకాల పచ్చళ్లు, పొడులు,సాంబార్, రసం, ఉప్పుడు మిరపకాయలు, ఇలా చాలా రకాల వెరైటీలను అందించనున్నారు.