*ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్*
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
పదోన్నతి పొందిన ఉద్యోగులకూ కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు
సీఎం వైఎస్ జగన్ చొరవతో జీవో విడుదల
బకాయిలతో కలిపి చెల్లింపు
రాష్ట్ర వ్యాప్తంగా 2,096 మందికి లబ్ధి
(ఆర్టీసీ)లో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు
వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది
డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది
గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది
పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తున్నారు
ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి.
సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి
ఈ నిర్ణయంతో 2,096 మందికి లబ్ధి చేకూరనుంది
వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్ డీఎంలు, 148 మంది గ్రేడ్–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్లు, 198 మంది మెకానిక్లు, 322 మంది సూపర్వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు