జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రపత్రిక): సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున అన్నారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తో కలసి సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమం లోఆయన పాల్గొన్నారు. సాగర్ నగర్ బీచ్ లో సాగర స్వచ్ఛత 10 వ విడత బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున ప్రారంబించారు. 10 వ విడత బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని సాగర్ నగర్ వద్ద నిర్వహిస్తున్నామని, ఇప్పటికే విశాఖలో 9 విడతలుగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను కొనసాగించామన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మరియు జి-20 సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రతే ద్యేయంగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతినెల క్రమం తప్పకుండా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేస్తున్నామని, చెత్తాచెదారాలను సేకరించి సద్వినియోగం చేస్తున్నామన్నారు. ఉదయం 6-00 గంటల నుండి 8 గంటల వరకు బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖవేలీ స్కూల్ విద్యార్థులు, డైట్ విద్యార్థులు, ఫారెస్ట్, రెవెన్యూ, జి వి ఎం సి, ఎన్ సి సి, విఎంఆర్డిఎ శాఖల సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు