మాడుగుల నియోజకవర్గం సమీక్ష సమావేశం
కె.కోటపాడు,ఫిబ్రవరి26(ఆంధ్ రపత్రిక): వైయస్సార్సీపి మాడుగుల నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం ఈనెల 27న కె.కోటపాడులో జరగనుందని ఎంపీపీ రెడ్డి జగన్ మోహన్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 03:00 గంటలకుజరగబోయే సమీక్ష సమావేశానికిముఖ్యఅతిధులుగా వైయస్సార్సీపి రీజనల్ కో-ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖామంత్రిబూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ మహిళా విభాగం నూతన అధ్యక్షురాలు, ఉమ్మడి విశాఖజిల్లా స్ర్తీ,శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ మండల జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ పాల్గొంటారని ఆయన తెలిపారు.ఈ సమీక్ష సమావేశంనకు నియోజక వర్గంలోని నాలుగు మండలాల ఎంపీపీలు , జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు,వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పాక్స్ అధ్యక్షులు, నియోజకవర్గం స్థాయి నాయకులు హాజరై జయప్రదం చేయాలని ఎంపీపీ రెడ్డి జగన్ మోహన్ కోరారు.