– డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు.
యువతను జాగృతులను చేశి వారిలో సేవాదృక్పధాన్ని పెంపోదించడంలో గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అద్వితీయమని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు తెలిపారు.ఈ నెల 26వ తేదీ గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ నాలుగోవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.తెలుగు రాష్ట్రాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరైనారు.ఈ సందర్భంగా వనమా బాలవజ్ర బాబు ప్రసంగిస్తూ గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ విట్సన్ పాల్ చదువుకుంటూ సామాజిక సేవలో భాగస్వామ్యులైనరన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా 1000 మంది రక్తదానం చేయడం హర్షణీయమన్నారు.1990 వ దశాబ్దంలో ప్రతి జిల్లా నుండి 50 వేల మంది అక్షర వాలంటీర్లుగా కృషి చేసి 17 శాతం అక్షరాస్యత పెరుగుదలకు దోహదపడ్డారని గుర్తు చేశారు.దాతృత్వాన్ని,సేవా తత్పరతను పెంపొందించవలసిన కర్తవ్యం మనందరిపై వుందన్నారు. ప్రపంచ అసమానతల సూచికలో భారతదేశం 107వ స్థానంలో వుందని,ఒక్క శాతం భారతీయుల వద్ద దేశ సంపదలో 50% కేంద్రీకృతమై వుందని, అట్టడుగున వున్న 50 శాతం ప్రజల వద్ద 13% మాత్రమే సంపద వుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతల నిర్మూలన కోసం, పేదరికం పారద్రోలటానికి గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలు మరిన్ని రావాలన్నారు.వారెన్ బఫెట్,బిల్ గేట్స్,సుధానారాయణమూర్తి,శివ నాడార్,ప్రేమ్ జీ లను ఆదర్శంగా తీసుకొని భారతీయ కార్పొరేట్ కంపెనీలు దాతృత్వం వైపు దృష్టి మరలించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ లైఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ విట్సన్ పాల్,బహుజన మహాసభ సెంట్రల్ కమిటీ సెక్రటరీ భగత్ సింగ్,దారా సుధాకర్,దాసరి జెన్ని బాబు,కేశవ శివ నాగన్న,తెలుగు రాష్ట్రాల నుండి వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.