-లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్
గూడూరు ఆంధ్ర పత్రిక ఫిబ్రవరి 26. ……పేదలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న లయన్స్ క్లబ్ గవర్నర్ బయ్యా రవి కుమార్ సేవలు అభినంద నియమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ రవి కుమార్ తల్లి బయ్య సరోజనమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా జిల్లాలోని అన్ని లయన్స్ క్లబ్ ల ద్వారా వారి సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అని పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన తల్లి కిడ్నీ వ్యాధి తో మృతి చెందడం వలన నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల లోని డయాలసిస్ సెంటర్ కు 25 లక్షల రూపాయల విరాళం అందచేశారు అని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ మల్టిపుల్ లొనే అత్యుత్తమ సేవలు అందించారని , ప్రతి సభ్యుడు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కళ్యాణ సాయి, డిస్ట్రిక్ట్ చైర్మన్ వాకాటి రామ్మోహన్, మల్లెమాల మురళి రెడ్డి, శ్రీనయ్య, రూపేష్ రెడ్డి రవిచంద్ర రెడ్డి ,రాధాకృష్ణ , ఇక్ష్వా శివయ్య తదితరులు పాల్గొన్నారు.