అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని దేవేంద్రపురం గ్రామానికి చెందిన రైతు బాలునాయక్ (40) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కంబదూరు, ఫిబ్రవరి 25: అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని దేవేంద్రపురం గ్రామానికి చెందిన రైతు బాలునాయక్ (40) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలునాయక్కు 5 ఎకరాల పొలం ఉంది. టమోటా, మిరప పంటలను సాగు చేశాడు. పెట్టుబడులకు, బోర్లు వేయించేందుకు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద సుమారు రూ.10 లక్షలు అప్పు చేశాడు. పంట నష్టాలతో అప్పులు తీర్చే మార్గం లేక ఒత్తిడికి లోనయ్యాడు. శనివారం తోటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.