Taraka Ratna: తారకత్న ఎప్పుడైతే కుప్పం పాదయాత్రలో పాల్గొని హార్ట్ ఎటాక్ కి గురై 23 రోజులపాటు బెంగళూరులో చికిత్స తీసుకున్నారో అప్పటినుండి తారకరత్న ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియాలో చాలానే వినిపించాయి. అంతే కాదు తారక రత్న తండ్రి మోహనకృష్ణ తారకరత్న ని ఎందుకు దూరంగా పెట్టారు? అనే విషయం కూడా బాగానే వైరలైంది. తారకరత్నను తన తండ్రి దూరం పెట్టడానికి ప్రధాన కారణం మోహన కృష్ణకి ఇష్టం లేని పెళ్లి తారక రత్న చేసుకోవడమే.
అయితే అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకుంది. కానీ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తారక రత్న కు పరిచయమై వారి పరిచయం కాస్త ప్రేమ వరకు దారితీసి పెళ్లి చేసుకున్నాడు తారకరత్న (Taraka Ratna) .అయితే ఈ విషయంలో మోహన కృష్ణ కు అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదు. అంతేకాదు అంతకుముందే తారక రత్న పెళ్లి విషయంలో మోహనకృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నారట.
అదేంటంటే.. మోహనకృష్ణ (Mohana Krishna) ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఓ ప్రొడ్యూసర్ చిన్న కూతురిని ఇచ్చి తారకరత్నకి పెళ్లి చేయాలనుకున్నారట. అంతేకాదు పెద్దల సమక్షంలో తారకరత్న ఆ అమ్మాయి గురించి పెళ్లి విషయం మొత్తం చర్చించుకున్నారట.కానీ ఈ విషయం తెలిసి తారకరత్న ఇంట్లో నుండి వెళ్లిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాక మోహన కృష్ణ ఆ పెళ్లిని అంగీకరించక పోవడంతో ఇంట్లో నుండి వారిని వెళ్లగొట్టారు.
ఇలా తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకొని తారకరత్న (Taraka Ratna) చాలా రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన చనిపోయాక ఆయన గురించి ఈ విషయం బయటపడింది.ఒకవేళ ఆ అమ్మాయిని తారక రత్న పెళ్లి చేసుకుంటే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉండేవారు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.