మేనల్లుడి కోసం వినోదయసిత్రమ్లో రోల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సాయి ధరమ్ హీరోలాగా తమిళ్ సినిమా ’వినోదయ సిద్దమ్’ తెలుగులో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. బుధవారం సినిమా లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో పవన్ సహా కీలక నటులుంతా పాల్గొన్నారు. ఇందులో కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో అలా వచ్చి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ సినిమా చేయడం కూడా మేనల్లుడి కోసమే చేస్తున్నట్లు ఓవైపు ప్రచారం సాగుతోంది.
అవన్ని పక్కనబెడితే పవన్ దేవుడి పాత్ర పోషించడం మాత్రం ఇది రెండవ సారి ఇంతకు ముందు ’గోపాల గోపాల’ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హీరోగా విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రమిది. బాలీవుడ్ సినిమా ’ఓ మైగాడ్’ కి రీమేక్ రూపం. అయితే ఆసినిమాలో దేవుడి పాత్ర మరీ అంత గొప్పగా పండిరది కాదు. పవన్ ఇమేజ్ ని ఎన్ క్యాష్చేసుకునే ప్రయత్నం తప్ప పాత్రలో పస లేదు.ఆ సినిమా కూడా యావరేజ్ గా ఆడిరది. ఆ రకంగా కృష్ణుడి పాత్రతో పవన్ మార్క్ అయితే పెద్దగా కనిపించలేదు. తాజాగా మరోసారి వినోదయ సిద్దమ్ లో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా? లేక దేవుడి పాత్రనే ఓ వండర్ గా మలుస్తున్నారా? అన్నది చూడాలి. ఇప్పటివరకూ ఈ సినిమాలో సాయితేజ్ని హైలైట్ చేసే ప్రయత్నం కనిపించింది తప్ప! పవన్ మాస్ ఇమేజ్ ని సినిమా పరంగా జనాల్లోకి ఇంకా అంతగా బలంగా తీసుకెళ్లలేదు. అయితే ఈ సినిమాకి కర్త..కర్మ..క్రియలా దర్శకుడు త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి పవన్ పాత్రని బలంగా మార్చడానికి అవకాశం ఉంది. ’గోపాల గోపాల’కి వేర్వేరు రచయితలు పనిచేయడం తో మాతృకని పెద్దగా మార్చలేదు. అలాగే పవన్ పాత్రని వారంతా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. మరి ఈసారి పీకే పాత్ర ఎలా ఉంటుందన్నది చూడాలి. పవన్ ని అభిమానులు దేవుడిగా ఆరాదిస్తుంటారు. మా దేవుడు మా దేవుడు అంటూ ఎప్పటికప్పుడు రచ్చ చేస్తుంటారు. మరి వాళ్ల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని గురూజీ నిజంగానే దేవుడి అంతటి వాడ్ని చేసేస్తాడా? అన్నది చూడాలి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!