వివరణ ఇచ్చిన ఎపి ప్రభుత్వం
ఫ్యాక్ట్ చెక్.ఏపీ.జీఓవీ.ఇన్ అనే ట్విట్టర్ పేజీ ద్వారా ఎప్పటికప్పుడు క్లారిటీ
అమరావతి,ఫిబ్రవరి 22 (ఆంధ్రపత్రిక): సోషల్ విూడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు పంపాల్సిందిగా ఉత్తర్వులు జారీ అంటూ … తాజాగా సోషల్ విూడియాలో వైరల్ అవుతున్న పోస్టర్‌పై ఎపి ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్ విూడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు పంపాల్సిందిగా ఉత్తర్వులు జారీ ’ అంటూ ఓ పోస్ట్ తాజాగా… సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. అంతటితో ఆగకుండా ఓ సర్క్యూలర్‌ను కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారడంతో ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిందని ప్రచారం జరుగుతోన్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్ విూడియాలో వైరల్ అవుతోన్న సదరు సర్క్యూలర్లు గతంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొంది. ఈ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై నెట్టింట జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్.ఏపీ.జీఓవీ.ఇన్ అనే ట్విట్టర్ పేజీ ద్వారా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది.