’రమన్ రాఘవ్’మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సోయగం శోభిత ధూళిపాళ. తెలుగులో అడివి శేష్ నటించిన ’గూఢచారి’ మూవీతో పరిచయమై మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఇందుల తనకు దక్కిన ప్రాధాన్యత కేవలం లిప్ లాక్ లలో కనిపించడమే. ఇప్పటి వరకు తను నటించిన ప్రతీ మూవీ వెబ్ సిరీస్ లలోనూ లిప్ లాక్ బికినీలకే పరిమితమైపోయి హాట్ టాపిక్ గా మారిన శోభితా ధూళిపాళ తాజాగా మరో సారి వార్తల్లో నిలిచింది. శోభితా ధూళిపాళ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ’ది నైట్ మేనేజర్’. అనిల్ కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్రిటీష్ టెలివిజన్ సీరియల్ ’ది నైట్ మేనేజర్’ ఆధారంగా ఈ సీరిస్ ని హిందీలో రీమేక్ చేశారు. కైమ్ర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కు ప్రియాంక గోష్ రుఖ్ నబీల్ సందీప్ మోదీ దర్శకత్వం వహించారు. అమ్రితా సేన్ బాలీవుడ్ వెటరన్ క్రేజీ హీరోయిన్ ప్రీతీ జింటా నిర్మించారు. ఫిబ్రవరి 17 నుంచి హిందీ తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.నాలుగు ఎపిసోడ్ ల నేపథ్యంలో ఈ సిరీస్ ని నిర్మించారు. ఈ సిరీస్ లో శోభితా ధూళిపాళ తనదైన మార్కు గ్లామర్ తో మెస్మరైజ్ చేయబోతోందని ట్రైలర్ తో స్పష్టమైంది. ఇందులో అనిల్ కపూర్ గాళ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో శోభిత నటించింది. 30 ఏళ్ల శోభిత..66 ఏళ్ల అనిల్ కపూర్ మధ్య ఓ రేంజ్ రొమాంటిక్ సీన్స్ ని రూపొందించారు. ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ ఓ రేంజ్ లో వున్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అనిల్ కపూర్ లో లస్ట్ లో మునిగితేలే శోభితని ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమించడం మరో ట్విస్ట్..అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లేవు కానీ అనిల్ కపూర్ తో మాత్రం శోభితకు ఓ రేంజ్ సీన్స్ వుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్ని సీన్స్ లో లిప్ లతో రెచ్చిపోగా మరి కొన్ని చోట్ల బికినీల్లో దర్శన మిచ్చి హీట్ పుట్టిచింది. త్వరలో దీనికి పార్ట్ 2 రాబోతోంది. జూన్ లో పార్ట్ 2 ని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో అడివి శేష్ నటించిన ’మేజర్’లోనూ మెరిసిన శోభిత .. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ’పొన్నియిన్ సెల్వన్ 1’లోనూ నటించే అవకాశాన్ని దక్కించుకుంది. త్వరలో ’పొన్నియిన్ సెల్వన్ 2’ కూడా రాబోతోంది. ఇందులోనూ శోభిత నటించడం విశేషం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!