రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో , ఫిబ్రవరి 21 : ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత అని, సమస్య పరిష్కారానికి ఆ దేశాలు సిద్ధంగా లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆక్షేపించారు.అలాగే చర్చలకు సిద్ధంగానే ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన నేపథ్యంలో.. జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసగించారు.‘మేం సమస్యను పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశం ఎదుర్కొంటోన్న సవాళ్లను దశలవారీగా జాగ్రత్తగా, క్రమపద్ధతిలో పరిష్కరిస్తాం. కానీ మా వెనక పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రష్యా సరిహద్దు వద్దకు నాటో విస్తరించాలని భావించింది. మనం మన దేశ ఉనికి గురించే మాట్లాడుతున్నాం. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత. సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఆ దేశాలు సిద్ధంగా లేవు. వాటి వైఖరితో సమస్య మరింత జఠిలం అవుతోంది. యుద్ధం కోసం ఆ దేశాలు 150 బిలియన్ల డాలర్లు ఇచ్చాయి. స్థానిక ఘర్షణను అంతర్జాతీయ ఘర్షణగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టిస్తారు. కానీ మేం ప్రపంచ భద్రత కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని పుతిన్వ్యాఖ్యానించారు.సోమవారం బైడెన్ ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సంఫీుభావ సంకేతకంగా ఆయన ఆ దేశ రాజధాని కీవ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. యుద్ధ నేపథ్యంలో తదుపరి చర్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సాగుతోన్న రష్యా దాడిని.. ‘కిరాతకం, అన్యాయమైన యుద్ధం’ అని అభివర్ణించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!