ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens t20 Wolrd Cup 2023) ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా (INDw vs ENGw) నిలకడగా సాగుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో 152 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్మృతీ మంధాన (33*), రిచా ఘోష్ (1*) ఉన్నారు. దీంతో చివరి 9 ఓవర్లలో టీమ్ఇండియా విజయానికి 88 పరుగులు కావాలి.
దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు నాలుగో ఓవర్లో ఎదురు దెబ్బ తగిలింది. షఫాలీ వర్మ (8)ను లారెన్ బెల్ బోల్తా కొట్టించింది. షఫాలీ-స్మృతీ తొలి వికెట్‌కు 29 పరుగులను జోడించారు. ఆ తర్వాత వచ్చిన జెమీమా (13)తో కలిసి స్మృతీ మరో 28 పరుగులను జోడించింది. కానీ, జెమీమా సాధికారికంగా ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయింది. అనంతరం వచ్చిన కెప్టెన్ హర్మన్ కౌర్ (4) కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరింది. ఓవైపు స్మృతీ దూకుడు ప్రదర్శిస్తున్నా.. స్కోరు బోర్డులో మాత్రం వేగం లేకుండా పోయింది.