ప్రయాణికులకు మెట్రో కీలక అలర్ట్ జారీ చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయుష్) ముగియడంతో మెట్రో రైలు వేళలు గురువారం నుంచి మారాయి. రాత్రి 12 గంటలు కాకుండా గతంలో నడిచినట్లే రాత్రి 11 గంటలకే..
ప్రయాణికులకు మెట్రో కీలక అలర్ట్ జారీ చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయుష్) ముగియడంతో మెట్రో రైలు వేళలు గురువారం నుంచి మారాయి. రాత్రి 12 గంటలు కాకుండా గతంలో నడిచినట్లే రాత్రి 11 గంటలకే చివరి ట్రిప్ రైళ్లు బయల్దేరతాయి. టర్మినల్ స్టేషన్లైన ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్ నుంచి చివరి మెట్రో రైళ్లు వెళ్తాయి. రాత్రి 12 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఎగ్జిబిషన్ సందర్భంగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో అందించిన సేవలకుగాను నుమాయిష్ ముగింపు రోజు కియోలిస్ స్టేషన్స్ డీజీఎం జైపాల్‌రెడ్డిని మంత్రి మహమూద్ అలీ అభినందించారు. జ్ఞాపికను బహూకరించారు.
కాగా.. నాంపల్లిలో నుమాయిష్ సందర్భంగా.. మెట్రో ట్రైన్ సేవలను మరో గంట పొడిగిస్తున్నట్లు గతంలో అధికారులు వెల్లడించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు అర్థరాత్రి 12 గంటల దాక మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్బీ నగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో ఈ పెంచిన పని వేళలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నుమాయిష్ పరిధిలోని గాంధీభవన్ మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్లు పెంచారు.
అయితే.. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ 46 రోజులు ఎగ్జిబిషన్‌కు వెళ్లేందుకు 11 లక్షల మంది ప్రయాణికులు మెట్రో వినియోగించుకున్నారని మెట్రో వర్గాలు తెలిపాయి.