*ఆలరించనున్న డాన్స్ బేబీ డాన్స్,బుర్రకథ కార్యక్రమాలు
*ఉర్రూతలూగించనున్న గుర్రాల పరుగు పందెం
వేపాడ,పిబ్రవరి,15( ఆంధ్ర పత్రిక):- మండలంలోని కొండగంగుబూడి గ్రామస్తుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుండి గ్రామంలోని భక్తులు అమ్మవారి దేవాలయానికి తరలి వెళ్లి పసుపు,కుంకుమలతో ధూప, దీప నైవేద్యాలతోపూజలు నిర్వహించి,మొక్కులను చెల్లించుకుంటారు.అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి గుర్రాల పరుగుల పందెం చూపరులను ఉర్రూతలూగించనుంది.అలాగే అదే రోజు సాయంత్రం 6గంటలకు ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్,రాత్రి 10గంటలకు ఏర్పాటు చేసిన బుర్రకథ ప్రదర్శనలు చూపరులను ఎంతగానో అలరించనున్నాయి.ఈ తీర్థ మహోత్సవాన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా గ్రామ కమిటీ సభ్యులు కోరుకున్నారు.