న్యూజిలాండ్ చరిత్రలో మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి..!
గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం
వేల కుటుంబాలకు విద్యుత్తు అందకపోవడంతో చీకట్లో కాలం గడపాల్సిన పరిస్థితి
ప్రతి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు
11 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు
అత్యంత తీవ్రమైన రెడ్ వార్నింగ్ జారీ చేసిన న్యూజిలాండ్ వాతావరణ శాఖ
న్యూజిలాండ్,ఫిబ్రవరి 14 : న్యూజిలాండ్ చరిత్రలోనే మంగళవారం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది.వేల కుటుంబాలకు విద్యుత్తు అందకపోవడంతో చీకట్లో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దాదాపు 11 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని న్యూజిలాండ్ వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధాని క్రిస్ హిప్కిన్స్ మాట్లాడుతూ.. ప్రజలు నిద్రలేచే సమయానికి పూర్తిస్థాయి విపత్తు కమ్ముకొందని పేర్కొన్నారు. ‘’మేము గత 24 గంటల్లో పరిస్థితిని చూస్తే.. ప్రజల అత్యవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది’’ అని క్రిస్ వెల్లడిరచారు.కొన్ని వారాల క్రితమే ఆక్లాండ్, ఉత్తర ఐలాండ్ ప్రాంతాలను భారీ తుపాను తాకింది. గత నెలలో ఆక్లాండ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో నలుగురు మరణించారు.క్రైస్ట్‌చర్చ్ భూకపం (2011), కొవిడ్ వ్యాప్తి(2020) తర్వాత న్యూజిలాండ్‌లో తాజాగా ఇప్పుడే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తాజాగా 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. చాలా కమ్యూనిటీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దేశంలో ఉత్తర ఐలాండ్‌లోని కొన్ని భాగాల్లో 30 జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేశారు. ఇక ఆక్లాండ్ ఎయిర్ పోర్టు నుంచి దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు. నేపియర్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఫిబ్రవరి సగటు కంటే మూడు రెట్ల అధిక వర్షపాతం నమోదైంది. న్యూజిలాండ్ వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన రెడ్ వార్నింగ్ జారీ చేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!