కేంద్రాన్ని నిలదీయడంలో పూర్తిగా విఫలం
వైసిపి తీరుపై మండిపడ్డ ఎంపి రామ్మోహన్ నాయుడు
న్యూఢల్లీి,ఫిబ్రవరి13(ఆర్ఎన్ఎ): పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెడితే వైసీపీ తమ గొప్పతనం అన్నట్టు హంగామా చేశారన్నారు. గంటల వ్యవధిలో కేంద్రం హోదాను అజెండా నుంచి తీసేసిందని తెలిపారు. వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు అనే సిద్దాంతంతో టీడీపీ పనిచేస్తుందని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టిడిపి వచ్చిన తరవాతనే బడుగు,బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాయన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ జగన్పై ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమయ్యిందన్నారు. ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నవరత్నాలు సైతం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. పేదవాడు దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నాడని తెలిపారు. గ్రామ సచివాలయాలు సక్రమంగా పనిచేయటం లేదని, ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయి స్తున్నట్లు చెప్పారు. స్టాలిన్, కేసీఆర్, మమతలు కేంద్రంపై పోరాడుతున్నారన్నారు. జగన్ ఎందుకు మాట్లాడలేక పోతున్నారని నిలదీశారు. జగన్ పులకేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ కి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జగన్ సర్కార్ అరాచక పాలనతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఎంపి అన్నారు. వైసీపీ ప్రభుత్వ అరా చకాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని కోరారు. రానున్న సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి సీఎంగా చంద్రబాబును చేసేందుకు కార్యకర్తలు, నేతలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని టీడీపీ నేత విమర్శించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారిని బెదిరించడం, కేసులు పెట్టి వేధించడం జగన్ పాలనలో పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ పాలనపై అన్నివర్గాల ప్రజలు విసిగి వేసారిపోతున్నారన్నారు. టీడీపీ పథకాలకు పేర్లు మార్చి కొందరికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రామ్మోహన్
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!