పార్లమెంట్ ముందుకు రాని 21 ఏళ్ల వయసు బిల్లు
అమ్మాయిల రోణకు తక్షణ చర్యలు అవసరం
న్యూఢల్లీి,ఫిబ్రవరి12 (ఆంధ్రపత్రిక) : ప్రపంచంలోనే అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నది మన దేశంలోనే అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో బాలికల కనీస పెళ్ళి వయసు 18 ఏళ్లయినా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో చిన్నారులు పెళ్ళిపీటలు ఎక్కుతున్నారు. వీటిని అరికట్టేందుకు గతంలో వివాహ వయస్సును 18 ఏళ్లకు పెంచారు. అయినా బాల్య వివాహాలు ఆగడంలేదు. దీనిని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనలో కేంద్రం ముందుకు వచ్చినా దానికి చట్టరూపం ఇవ్వలేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా అవకాశం లేదు. దీనిని ఎంత త్వరగా చట్టరూపంలోకి తీసకుని వస్తే అంత ప్రయోజన
కారిగా ఉంటుంది. గతంలో ముక్కుపచ్చలారని అమ్మాయిలకు ముసలి వాళ్లను ఇచ్చిన దురాచారాలు కూడా ఉన్నాయి. ఎన్నో దురాచారాలను చట్టాల ద్వారా మనం పాతరేస్తూ వస్తున్నాం. సతీసహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం లాంటి సమస్యలను అధిగమిస్తున్నా..ప్రజల్లో చైతన్యం రానిదే వీటిని అరికట్టలేమని గుర్తించాలి. చైతన్యానికి తోడు కఠినంగా చట్టాలను అమలు చేయడం కూడా ముఖ్యమే. ఆర్థిక స్వేచ్చ ఉన్న అమ్మాయిలకు చిన్న వయస్సులో పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. నిజానికి, పెళ్లి వయసు ఎంత ఉండాలనే దానిపై మన దేశంలో భిన్నాభిప్రాయలు ఉన్నాయి. మన చారిత్రక నేపథ్యం ..భిన్న సంస్కృతులు దానికి ఒక కారణం కావచ్చు. పూర్వం విదేశీ దాడులు.. అమ్మాయిలను ఎత్తుక పోవడం వంటి దుష్కృత్యాల కారణంగా ఆకాలంలో మనపూర్వీకులు అమ్మాయి లను కాపాడుకునే ప్రయత్నంలో బాల్య వివాహాలయినా ఫర్వాలేదంటూ చేసేసారు. అష్ట వర్షాత్ భవేత్ కన్యా అన్న నానుడి వచ్చి..ఎనిమిదేళ్లకే పెళ్లిళ్లు చేశారు. పెళ్లయిన వారి జోలికి ముష్కరులు వెళ్లకుండా ఉంటారన్న ఆలోచనతో ఈ పనిచేశారు. ఈ క్రమంలో మొదటి సారి అధికారిక వివాహ వయస్సు నిర్ణయించింది మాత్రం బ్రిటిష్ వారే. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం తెచ్చింది. తరువాత ఇది శారదా చట్టంగా ప్రసిద్ధి చెందింది. దాని ప్రకారం ఆడపిల్ల వివాహ వయస్సు పద్నాలుగు సంవత్సరాలు,అబ్బాయిల కు ప్దదెనిమిది సంవత్సరాలుగా నిర్ణయించారు. భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమ ఫలితం కారణంగా ఈ చట్టం చేశారు. కానీ బ్రిటిష్ వారు కూడా దానిని ప్రభావవంతంగా అమలు చేయటంలో విఫలమయ్యారు. హిందూ, ముస్లిం మతవాద గ్రూపుల మద్దతు కోల్పోతామనే భయం వల్ల నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం దీనిని సమర్ధవంతంగా అమలు చేయలేదు. ఇప్పుడు కూడా దేశంలో చాలా చోట్ల ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా వంటి రాష్టాల్ల్రో ఈ చట్టం అమలు అంతంత మాత్రమేగానే ఉందని తెలుస్తోంది. అంతెందుకు ఇప్పటికీ చాలా వరకు గ్రావిూణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు సాధారణ వ్యవహారం గానే సాగుతూనే ఉన్నాయి. స్వాతంత్యాన్రంతరం 1949లో భారత ప్రభుత్వం బాలికల వివాహ వయస్సును పదిహేనేళ్లకు పెంచింది. తరువాత 1978లో అప్పటి జనతా ప్రభుత్వం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లను వివాహ వయస్సుగా చట్టసవరణ చేసింది. గత నలబై మూడేళ్లుగా ఇదే అధికారిక వివాహ వయసుగా ఉంది. అంతకన్నా తక్కువ వయసు బాలబాలికలకు పెళ్లి చేస్తే అది బాల్య వివాహమవుతుంది..పెళ్లి జరిపించిన వారు శిక్షార్హులు అవుతారు. రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. ఇప్పుడు మళ్లీ బాలికల వయస్సును 21 ఏళ్లకు పెంచడం అన్నది ఓ విప్లవాత్మక నిర్ణయంగానే చూడాలి. అయితే మార్పు ఒక్కరోజులో రాదు. గతంలో ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితి లేదు.. ఎంతో కొంత మార్పు వచ్చింది. తాజాగా వివాహ వయస్సును 21 ఏళ్లకుసవరించాలన్న సవవరణలతో మరింత మార్పునకు అవకాశం ఉందనటంలో సందేహం లేదు. పెళ్ళి వయసు పెంచితే, బాల్యవివాహాలను తగ్గించేందుకు కృషి చేయాలి. నగర ప్రాంతాల్లో పరిస్థితులు చాలా వరకు మారాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు ఎప్పటినుంచో 25 దాటితే గానీ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. గ్రావిూణ ప్రాంతాల్లో విద్యకు దూరంగా ఉన్నవారినుంచే వచ్చిన చిక్కల్లా. మారుమూల గ్రావిూణ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపేలా చర్యలు,ప్రచార కార్యక్రమాలు ఉండాలి. అలాగే విద్యావకాశాలను పెంచాలి. బలికా విద్యకు ప్రోత్సాహాలు పెంచాలి. ఉద్యోగావకాశాలను కూడా పెంచాలి. గ్రావిూణ ప్రాంతాలలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు విద్య,ఉద్యోగావకాశాలు తక్కువ. అందుకే, వారికి త్వరగా పెళ్లిళ్లు చేస్తారు. బాల్యవివాహాల కేసులు కూడా
ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంటాయి. 18 ఏళ్లకే పెళ్లిళ్లు జరగడం వల్ల అమ్మాయిల కెరీర్ కు అవరోధం ఏర్పడుతోందని, చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందన్న వాదనలు ఉన్నాయి. అమ్మాయి తొలిసారి గర్భం దాల్చే నాటికి ఆమెకు 21 ఏళ్లు ఉండాలని టాస్క్ఫోర్స్ ప్రతిపాదించింది. 21 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల వారి కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడిరది. వివాహ కనీస వయసును పెంచడం వల్ల ఇలాంటి అమ్మాయిల జీవితాలు మెరుగుపడితే అంతకన్నా ప్రయోజనం మరోటి ఉండదు. పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదన లతో పాటు ప్రయోజనాలు కూడా కల్పిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!