అన్ని రంగాల్లో విఫలమైన ఆసిస్ జట్టు
నాగ్‌పూర్,ఫిబ్రవరి12 ; బోర్డర్`గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో దారుణంగా ఓడిన ఆస్టేల్రియా భారత గడ్డపై ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అశ్విన్ స్పిన్ మాయాజాలానికి బెంబేలెత్తిన ఆసీస్ బ్యాటర్లు వరుపెట్టి పెవిలియన్ చేరారు. ఫలితంగా 91 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. భారత గడ్డపై ఆస్టేల్రియాకు ఇదే అత్యల్ప స్కోరు. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1`0తో ఆధిక్యం సంపాదించింది. అలాగే, ఆస్టేల్రియా పై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం ఇది ఐదోసారి. 1997/98లో కోల్‌కతాలో ఆస్టేల్రియా తో జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్టేల్రియా పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. నాగ్‌పూర్ టెస్టులో భారత్ సమష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చక్కని ప్రదర్శన కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్టేల్రియా ను 177 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 400 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా, రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84, మహమ్మద్ షవిూ 37 పరుగులు చేశారు. కంగారూ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్టేల్రియా భారత బౌలర్ల దెబ్బకు చిగురుటాకులా వణికింది. ముఖ్యంగా అశ్విన్ దెబ్బకు వికెట్లను టపటపా రాల్చుకుంది. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్ ఆస్టేల్రియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. షవిూకి రెండు వికెట్లు దక్కాయి. భారత్`ఆస్టేల్రియా మధ్య రెండో టెస్టు ఢల్లీిలో ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1న జరగనున్న మూడో టెస్టుకు ధర్మశాల, 9 నుంచి జరగనున్న చివరిదైన నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తాయి. అనంతరం మార్చి 17 నుంచి మూడు మ్యాచ్‌ల
వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!