మైక్ లాగేసుకున్న పోలీసులు..భగ్గుమన్న టిడిపి
గంగాధర నెల్లూరులో 14వ రోజు యాత్ర ప్రారంభం
చిత్తూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక): టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడుగడునా అడ్డుంకులు సృష్టిం చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల లోకేష్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు తాజాగా లోకేష్ మాట్లాడే మైక్‌ను లాక్కున్నారు. గురువారం సంసిరెడ్డిప్లలెకు చేరుకున్న లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేష్‌ను మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న బాషాపై దాడి చేసి గాయపరిచి మరీ పోలీసులు మైక్ లాక్కున్నారు. లోకేష్ నిలుచున్న స్టూల్‌ను కూడా లాక్కునేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. పోలీసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా లోకేష్ స్టూల్ విూదే నిలబడి నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సొంత నియోజకవర్గం గంగాధరనెల్లూరులో 14వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైంది. దాదాపు ఐదారు కిలోవిూటర్లు నడిచిన తర్వాత గంగాధర నెల్లూరు మండలం సంసిరెడ్డిప్లలె వద్దకు పాదయాత్ర చేరుకుంది. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు హ్యాండ్ మైక్‌ను తీసుకురావాల్సిందిగా కార్యకర్తను లోకేష్ కోరారు. మైక్ తీసుకువెళ్తున్న కార్యకర్తను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఇక్కడ మాట్లాడేందుకు వీలులేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్త భాషాపై పోలీసులు దాడి చేయడంతో రక్తస్రావమైంది. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే వారికి మద్దతుగా లోకేష్ స్టూల్ విూద ఎక్కి నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఏదో ఒక ఆవాంతరం నడుమ లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!