ఎమ్మెల్యేలకు ఎర కేసులో స్టేకు నిరాకరణ
న్యూఢల్లీి,ఫిబ్రవరి 8 : ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి..ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. కేసును విచారించి మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఫాం హౌస్ కేసులో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంను ఆశ్రయించింది. సీబీఐ కేసు విచారణ చేపడితే సాక్ష్యాలన్నీ ధ్వసం అవుతాయని పిటిషన్లో ఆందోళన వెలిబుచ్చింది.