తనకు రక్షణకూడా కల్పించాలి
హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన కోటంరెడ్డి
నెల్లూరు,ఫిబ్రవరి 8 (ఆంధ్రపత్రిక): ఫోన్ ట్యాపింగ్‌పై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపించడంతోపాటు.. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. తాను ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన తర్వాత తనను నెల్లూరు ఇన్ చార్జ్‌గా తప్పించారని.. ఆ తర్వాత నుంచి తనకు సంఘవిద్రోహశక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కోటంరెడ్డి తెలిపారు. తనపై అక్రమ కేసులు కూడా బనాయిస్తు న్నారన్నారు. తనతోపాటు తన కేడర్, మద్దతుదార్లకు కూడా ప్రాణ హాని ఉందని అమిత్ షాకు రాసిన లేఖలో కోటంరెడ్డి తెలిపారు. తన వ్యక్తిగత అంశాలను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని.. తన స్వేచ్ఛకు భంగం కలిగేలా.. వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేంద్రానికి లేఖ రాశానంటూ కోటం రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాన్నారు.ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానన్నారు. ట్యాపింగ్‌పై ఆరోపణలు చేస్తే తన పైనే విమర్శలకు దిగుతున్నారన్నారు. తాను ఆరోపణలు చేసినప్పుడు విూరు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలన్నారు. తనపై శాపనార్దాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయమని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. నన్ను తిట్లు తిట్టడం కాదు. అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించాను. నెల్లూరు రూరల్‌లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలి. పొదలకూరు రోడ్డులో 3 కిలోవిూటర్లు ఒక పక్కే వేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాలు జరిగుతున్నాయి. స్వయంగా సీఎం చూసి రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠశాల పూర్తి కాలేదు. వావిలేటుపాడులో 3 వేల మందికి ఇచ్చిన ఇళ్ల సమస్య నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దర్గామిట్టలోని బీసీ భవన్ కి నిధులు మంజూరు కాలేదు. అంబేద్కర్ భవన్, లైబ్రరీ పునాది దశలోనే నిలిచిపోయాయి. గణెళిష్ ఘాట్ రూ.15 కోట్ల 20 లక్షలు కేంద్రం నిధులు విడుదల చేశారు. అధికారుల సహకారం లేక పనులు జరగడం లేదు. రూ.30 లక్షల మందితో కులాలకు అతీతంగా జరిగే రొటట్టెల పండుగ ప్రాంతంలో రూ.15 కోట్లు అడిగితే సీఎం స్పందించి జీవో ఇచ్చారు. సీఎం ఇచ్చిన హావిూతో శంకుస్థాపన చేసినా.. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. సీఎం ని కలిసి అడిగితే వెంటనే పూర్తి చేయమని అధికారులకి చెప్పారు. నెలలు గడుస్తున్నా పరష్కారం కావడం లేదు’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.