అమ్మవారికి చలివిడి పానాకాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు
రావులపాలెం,పిబ్రవరి 5(ఆంధ్రపత్రిక) :మండలపరిధి ఈతకోట సత్తమ్మతల్లీకి మాఘ మాసం పూజలు అమ్మవారికి చలివిడి పానకాలను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.ఆదివారం మహిళలు ఆడపడుచులు గ్రామంలో చిన్న చెరువు గట్టున కొలువై ఉన్న సత్తెమ్మతల్లీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ఏడాది మాఘ మాసంలో వచ్చే మూడో ఆదివారం సత్తమ్మవారి ఆలయంలో మాఘ మాసం పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారంతో గ్రామంలోని మోటూరి రాముడు రాఘవ (సత్తమ్మ) దంపతులు ఇంటి వద్ద నుండి గండ్రోతు సత్తిబాబు ప్రేమలత, మోటూరి సత్తిబాబు రాజేశ్వరి కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులతో కలిసి బాజా భజింత్రీలతో ఊరేగింపుగా సత్తమ్మతల్లీ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చలివిడి పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు మోటూరి రాముడు రాఘవ(సత్తమ్మ) నివాసంలో అన్న ప్రసాదం భోజనాలు ఏర్పాట్లు చేశారు ఉదయాన్నే ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాసాచార్యులు, ఫణిచార్యులు సత్తమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని అలంకరించారు. గ్రామ ప్రజలు పుట్టింటి అడపడుచులు నూతన దంపతులు భక్తులు మహిళలు సత్తమ్మతల్లీని దర్శించుకుని చలివిడి వడపప్పు పానకాలుతో చీరలు రవికలు గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు