బిక్కవోలు, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరొందిన తణుకు వారి సత్తెమ్మ తల్లి సంబరం ఘనంగా నిర్వహించారు.రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలను తణుకు వంశస్థులు మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. మొదటి రోజు పంబ నాదపు కళాకారులు అమ్మవారి చరిత్రను వివరించగా రెండోరోజు ఘట రూపంలో ఉన్న అమ్మవారి రూపాన్ని బిక్కవోలు సహా పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శించి నైవేద్యాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా తీన్ మార్ వాయిద్యాలు, డప్పు డ్యాన్సుల, బ్యాండు మేళాల మధ్య జరిగిన ఉత్సవంలో అమ్మవారి వేషధారి ఇచ్చిన బియ్యాన్ని వండుకుని తిన్న సంతానం లేని దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. అలాగే మూడో రోజు తమ కోర్కెల ఫల సిద్ధికై అమ్మ వారి ప్రతిష్టా స్థానంలో ఇంతక్రితం పాతిపెట్టిన నాణాలను భక్తులు చేజిక్కించుకుని మరలా కొత్తగా నాణాలను పాతడం ఆనవాయితీగా వస్తోంది. కాగా అమ్మవారి దర్శనానికి మూడురోజులూ విచ్చేసిన భక్తులకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తణుకు సూరిబాబు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!