వి.వి.రాఘవరావుకు శ్రద్ధాంజలి
గుంటూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : శ్యామల నగర్ అభివృద్ధి ప్రదాత విన్నకోట వీర రాఘవరావు మరణం శ్యామల నగర్ వాసులకు తీరని లోటని శాసనమండలి సభ్యులు కె. ఎస్. లక్ష్మణరావు తెలిపారు. ఈనెల 5వ తేదీన గుంటూరు శ్యామల నగర్ పార్క్ లోని బ్యాట్మింటన్ మరియు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కీ.శే. విన్నకోట వీర రాఘవ రావు సంస్మరణ సభకు పల్లెటూరి పట్టణ సంఘం కార్యదర్శి డాక్టర్ పాలేరు పోతురాజు అధ్యక్షత వహించారు. కే.ఎస్ లక్ష్మణరావు ప్రసం గిస్తూ గత 40 సంవత్సరాలుగా రాఘవరావు ఎన్జీవోలకు చేసిన కృషిని కొనియాడారు. శ్యామల నగర్ అభివృద్ధికి, పార్క్ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసేవారని గుర్తు చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ రాఘవరావు రాజకీయాలకతీతంగా అభివృద్ధి ధ్యేయం గా కృషి చేశారన్నారు. ఎన్జీవోల సమస్యలు పరిష్కారం కోసం శ్యామల నగర్ వాసుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వారన్నారు, రాజకీయాల అతీతంగా శ్యామల నగర్ అభివృద్ధి, పార్క్ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయడమే రాఘవరావు గారికీ నిజమైన నివాళి అన్నారు. తొలుత విన్న కోట వీర రాఘవరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సామినేని కోటేశ్వరరావు, వామపక్ష వాది బొప్పూడి స్టాలిన్ బాబు, అడ్వకేట్ సురేందర్ రెడ్డి, ఇన్కమ్ టాక్స్ అధికారి రామ్ కిషోర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు తోటకూర శ్రీనివాస్ రావు, పుల్లారెడ్డి, వెంకటేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ నేతలు అమరేంద్ర, శేఖర్ రెడ్డి, నరసింహమూర్తి, మల్లారెడ్డి, కనపర్తి రాఘవరావు, డాక్టర్ జగదీష్,లింగారెడ్డి, జె.ఎస్. ఎస్. మూర్తి, వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొని కీ.శే. విన్నకోట వీర రాఘవరావు చేసిన సమాజ సేవలను గుర్తుచేసుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!