– సమస్యను వదిలి కుంటిసాకులు
– వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం
ముసునూరు (నూజివీడు) జనవరి 5 (ఆంధ్రపత్రిక) : అభాగ్యురా లికి రెండేళ్లుగా చేయూత అందక అవస్థలు పడతుంటే, ఆ సమ స్యను పరిష్కరించక పోగా ఆ అభాగ్యురాలిపైనే తిరిగి అబాండా లు మోపి అసలుకే ఎసరు పెట్టే కుతంత్రాలకు అధికారులు తెరలే పారు. మండల కేంద్రమైన ముసునూరు వాసీ అయిన బీసీ వర్గాని కి చెందిన రంగోజు కృష్ణ కుమారి వయసు 50 ఏళ్లు పై బడ్డాయి. చేయూత పథకానికి అన్ని విధాలుగా అర్హురాలిగా ఉంది. మధు మేహ వ్యాధితో కృష్ణ కుమారి గత 25 ఏళ్లుగా పీడిరచబడుతుంది. మధుమేహ వ్యాధి ముదిరి కాళ్లకి పుండ్లు పడి నడవలేని పరిస్థితిలో ఆ అభాగ్యురాలు ప్రస్తుతం కొట్టు మిట్టాడుతుంది. ముసునూరులో ఐదేళ్లుగా కృష్ణ కుమారి కుటుంబం ఉంటుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు సమస్తం ముసునూరు అడ్రస్ పేరుతోనే ఉన్నాయి. చేయూత పథకం 2020 లో ప్రారంభించినప్పుడు ఆ పధకానికి కృష్ణ కుమారి అర్హత పొంది మొదటి విడత అమోంట్ 18, 700 లను అప్పట్లో అందుకుంది. రెండవ (2021) విడత వచ్చేసరికి సాంకేతిక సమస్య కారణంగా చేయూత అమౌంట్ ఆ సంవత్సరం పడలేదు, రెండవ విడత రాలేదు మూడవ(2022) విడత అమౌంట్ అయినా తప్పనిసరిగా వచ్చే విధంగా చూడాలని కృష్ణ కుమారి, ఆమె కుటుంసభ్యులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. మ్యాపింగ్ అవ్వలేదంటే వాలంటీర్ చుట్టు ఒకటికి నాలుగు సార్లు తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికి కృష్ణకుమారి చేత ఈ కేవేసి చెయ్యించి మ్యాపింగ్ చెయ్యించారు. వాలంటీర్ పని అయ్యి పొయ్యింది ఆ తదనంతరం బ్యాంకు అకౌంట్ తో ఆధార్ లింక్ అవ్వలేదంటే బ్యాంకులో సీడిరగ్ చెయ్యించారు. ఆ తర్వాత ముసునూరు సచివాలయం-2, వెల్పేర్ అసిస్టెంట్ ని సంప్రదించగా కొత్తగా చేయూతకి మరలా ఆన్లైన్ చెయ్యాలి అంటే తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగి కొత్తగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తీసుకొచ్చి వెల్పేర్ అసిస్టెంట్ ని కలిశారు. ధ్రువీకరణ పత్రాల ఆధారంగా వెల్పేర్ అసిస్టెంట్ మరలా కొత్తగా చేయూత పధకంకి దరఖాస్తును చేశారు. చేయూత ఆన్లైన్ కొత్తగా చేశాను ఈసారి( మూడవ విడత) పక్కాగా అమౌంట్ జమ అవుతుందని వెల్పేర్ అసిస్టెంట్ పేర్కొన్నారు. చేయూత అమౌంట్ మూడవ విడత అయినా పక్కాగా వస్తాయని అభాగ్యురాలు అయిన కృష్ణ కుమారి, ఆమె కుటుంసభ్యులు అనుకున్నారు చాలా ఆనందించారు.
పక్కా అనుకున్నా తక్కిన లెక్క
అయితే మూడవ విడత చేయూత అమౌంట్ గత ఏడాది సెప్టెంబర్లో విడుదల అయ్యాయి. మూడో విడత చేయూత డబ్బులు కూడా ఆ అభగ్యురాలికి పడలేదు. సమస్య మళ్లీ మొదటికి రావడంతో మరలా సచివాలయం చుట్టు కృష్ణకుమారి ఆమె కుటుం బ సభ్యులు మరలా తిరగటం ప్రారంభించారు. మూడవ విడత చేయుత అమౌంట్ ఎందుకు పడలేదు అనే విషయమై వెల్ఫేర్ అసిస్టెంట్ ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసింది. అయితే స్టేటస్ లో ఆన్లైన్ చేసినట్టు మాత్రమే కనపడుతుందని స్టేటస్ పూర్తి వివరాలు డిసిప్లే అవ్వడం లేదని వెల్ఫేర్ అసిస్టెంట్ ఆ అభాగ్యురాలికి సూచించింది. మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ కలవాలని వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పడంతో ఆయనని కలిశారు. ఆయన సైతం పూర్తి స్టేటస్ వివరాలు కనబడట్లేదనితెల్చారు. టెక్నికల్ సమస్య కారణంగా చేయూత అమౌంట్ అందని వారందరికీ డిసెంబర్లో అమౌంట్ పడతాయని జూనియర్ అసిస్టెంట్ చెప్పటంతో డిసెంబర్ నెలపై ఆ అభాగ్యురాలు ఆశలు పెట్టుకుంది. డిసెంబర్ వచ్చింది అమౌంట్ తప్పనిసరిగా వస్తుందని ఆశించిన కృష్ణకుమారికి మరలా నిరాశే ఎదురైంది.
కలెక్టర్ దగ్గరికి వెళ్లారని లేనిపోని అబండాలు
విడత డబ్బులు అందరికి పడి తనకు పడకపోవడం పట్ల ఆ అభాగ్యురాలు తీవ్రంగా తల ఢల్లింది, మండల అధికారులు సచివాల సిబ్బందితో లాభం లేదనుకున్న కృష్ణకుమారి ఆమె కుటుంబ సభ్యుల తోడుతో ఏలూరు జిల్లా కలెక్టర్ కి నూజివీడు సబ్ కలెక్టర్ కి ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసింది. స్పందనలో వచ్చిన పిటిషన్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ముసునూరు ఎంపీడీవో కి విచారణ ఈ విషయమై బాధ్యతలు అప్పగించారు. బాధిత మహిళలకు చేయూత అమౌంట్ ఎందుకు పడలేదు అనే విషయాన్ని విస్మరించిన విచారణ అధికారి ఎంపీడీవో విషయాన్ని పక్కదారి పట్టించే పనులకు పూనుకున్నారు. అభాగ్యురాలికి మరింత అన్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ కి నివేదిక పంపించారు. చేయూత అమౌంట్ అందని అభాగ్యురాలికి సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రాలన్నీ ముసునూరులోనే ఉన్నాయి. అది విస్మరించిన ఎంపీడీవో మధుమేహ వ్యాధి నివారణ చర్యలో భాగంగా చికిత్స నిమిత్తం గత ఏడాదిగా అనేక ఆసుపత్రులు చుట్టూ ఆ అభాగ్యురాలు ఊళ్లను పట్టుకొని తిరుగుతుంది.
అనారోగ్య కారణాల దృష్ట్యా ఇంటి దగ్గర ఉండటానికి ఆమెకు సాధ్యపడని పరిస్థితి. ఇంటి దగ్గర ఉండటం లేదని విషయం తెలుసుకున్న ఎంపీడీవో పరిస్థితులను ఆమె ఇంటి వద్ద ఎందుకు ఉండటం లేదనే విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాలంటీర్ వెల్పేర్ అసిస్టెంట్ వైఫల్యాలను కప్పిపుచ్చే క్రమంలో కృష్ణ కుమారి అనే ఆమె ఇంటి దగ్గర ఉండటంలేదని జిల్లా కలెక్టర్ కి నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు. ఎంపీడీవో అభాగ్యురాలి సమస్యను పరిష్కరించకుండా ఆమె ఇంటి దగ్గర ఉండటం లేదని కుంటి సాకును తెరపైకి తెచ్చి ఉన్నతాధికారులకు నివేదించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ అభాగ్యురాలి సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణం చేయూత రెండేళ్ల అమౌంట్ మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ముక్తకంఠంగా కోరుతున్నారు.