తాడేపల్లి, ఫిబ్రవరి 04 ; తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం వద్ద రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ పెరిక భవన్ నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరుగనుంది. ఉదయం 8 గంటలకు జరిగే భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ సీపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, టీడీపీ. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ రాజమండ్రి)లు హాజరవుతున్నారని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు కత్తిక రాఘవరావు పేర్కొన్నారు. సుమారు 600 చదరపు గజాల స్థలంలో ఐదు అంతస్తుల్లో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో పెరిక భవన్ నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని పెరిక విద్యార్థుల ప్రయోజనార్థం ఇక్కడే వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పెరిక సంఘం గౌరవాధ్యక్షులు కత్తిక పూర్ణచంద్రరావు (వడ్డేశ్వరం) రూ. 3 కోట్ల విలువ చేసే స్థలాన్ని సంఘం కోసం ఉచితంగా అందజేసినట్లు వివరించారు. శంకుస్థాపన కార్యక్రమానికి స్వసంఘీయులందరూ హాజరు కావాలని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరిశెట్టి చంద్రశేఖర్ కోరారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!