గీతకార్మికులకు దక్కని సాయం
బిసి మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ హామీ
బీసీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది టిడిపి పాలనలోనే..
విదేశీ విద్య పథకం రద్దు చేసి బీసీలను మోసం చేసిన ప్రభుత్వం
సలహాదారులుగా ఉండటానికి బీసీలు సరిపోరా ?
పాదయాత్రలో ప్రజలతో లోకేశ్ చర్చ
చిత్తూరు,ఫిబ్రవరి 4 (ఆంధ్రపత్రిక): పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్ సైట్లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం భేటీ అయ్యారు. పాదయాత్రలో భాగంగా వారితో లోకేష్ మాట్లాడుతూ … గీత కార్మికులకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని, ఈడిగలకు ఎలాంటి ఆర్ధిక సహాయం అందించలేదని అన్నారు. కల్తీ మద్యం అమ్మకం కోసం జగన్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులను వేధిస్తుందని ఆరోపించారు. మద్యం షాపుల్లో 25 శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించాలని కోరారు. 45 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశారని విమర్శించారు.పూతలపట్టు నియోజకవర్గం బీసీలు మాట్లాడుతూ … ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 లక్షల మంది వ్డడెర్లు ఉన్నారనీ, తమను ఎస్టీల్లో చేర్చాలని కోరారు. బండలు కొట్టడం, మట్టి పనులు చేసి జీవిస్తామని, యాంత్రీకరణ వలన ఉపాధి లేక ఇతర రాష్టాల్రకు వలస వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల్లో కొంత శాతం తమకు కేటాయించాలన్నారు. విశ్వ బ్రాహ్మణులు మెషినరీ వలన ఉపాధి కోల్పోతున్నారనీ, స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ముదిరాజుల బీసీ డి నుండి బీసీ ఏ కి మార్చాలని, నిధులు ఉండే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. పద్మశాలి సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, వైసిపి కార్యకర్తలకు మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నారని ఆరోపించారు. రజకలు వెనుకబడి ఉన్నారని, దోబి ఘాట్స్ కానీ రుణాలు కానీ ఇవ్వడం లేదని అన్నారు. కురుబలకు తీవ్ర అన్యాయం చేసింది వైసిపి ప్రభుత్వమేనని ఆరోపించారు. 80 లక్షల మంది కురుబ సామాజిక వర్గంవారు రాష్ట్రంలో ఉన్నారనీ, అయినా తమను చిన్న చూపు చూస్తుంది వైసిపి ప్రభుత్వం అని, ఒక్క సంక్షేమ కార్యక్రమం అందడం లేదని విమర్శించారు. యాదవ సామాజిక వర్గం తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పారు. గొర్రెలు, మేకలు పెంపకం పై తాము ఆధారపడి బతుకుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వం కుర్చీ లేని కార్పొరేషన్ ఇచ్చిందని, ఒక్క గొర్రె పిల్లని కూడా ఇవ్వలేదని బీసీలు ఆరోపించారు. నారా లోకేష్ మాట్లాడుతూ … బీసీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది టిడిపి పాలనలోనేనన్నారు. తాను జగన్‌లా మోసపు హావిూలు ఇవ్వబోనని అన్నారు. టిడిపి పాలనలో బిసిలకు ఇచ్చినన్ని నిధులు ఎవ్వరూ ఇవ్వలేదన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ రెడ్డి ఒక్క బీసీ కి ఒక్క లోన్ అయినా ఇచ్చారా ? అని అడిగారు. 45 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తా అని మోసం చేశారని ఆరోపించారు. రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి 16,500 మందిని జగన్ పదవులకి బీసీలను దూరం చేశారని మండిపడ్డారు. విదేశీ విద్య పథకం రద్దు చేసి బీసీలను మోసం చేశారని విమర్శించారు. 26 మంది బీసీలను దారుణంగా చంపేశారని ఆరోపించారు. సలహాదారులుగా ఉండటానికి బీసీలు సరిపోరా ? అని అడిగారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!