– కాకినాడ సీ పోర్ట్స్ సీఓఓ మురళీధర్,
దివ్యాంగులకు ఉపకారణాలు పంపిణీ
కొత్తవలస (ఆంధ్రపత్రిక) : మండలములో మంగలపాలెమ్ గ్రామానికి చెందిన గురుదేవా చారిటి బుల్ అధ్వర్యంలో కాకినాడ సీ పోర్ట్స్ సీ ఓ ఓ మురళీధర్, లీడర్ పత్రికా అధినేత రమణమూర్తి, చేతుల మీదుగా దివ్యాగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం జరిగింది, దివ్యంగుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయని కాకినాడ సీ పోర్ట్స్ సీఓఓ మెర్ల.మురళీధర్ కొనియాడారు. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ఆధ్వర్యంలో కాకినాడ సీ పోర్ట్స్ సంస్థ ఆర్ధిక సహకారంతో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. కాళ్ళు, చేతులు కోల్పోయిన లక్షలాదిమంది అభాగ్యులకు అండగా నిలుస్తూ జగదీష్ బాబు దేవుడయ్యారని అభినందించారు. దివ్యాంగులు ఆత్మస్టైర్యంతో ముందుకు సాగాలన్నారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆసుపత్రి ద్వారా పేదలకు అందిస్తున్న సేవలను అభినందించారు. లీడర్ అధినేత రమణమూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా జగదీష్ బాబు చేస్తున్న సేవలు మహాత్తమైనవని ప్రశాంశించారు. మనుషులంతా సమానంగా జీవిస్తూ, ఎదుటి వారికి సహాయమందించాలని కోరారు. ట్రస్ట్ కు తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు మాట్లాడుతూ 25 ఏళ్లుగా ట్రస్ట్ ద్వారా లక్షా 78వేల మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు, చేతులు, ఉపకారణాలను పలువురు దాతల సహకారంతో అందజేశామన్నారు. ట్రస్ట్ సేవల్లో భాగంగా కాకినాడ సీ పోర్ట్స్ సంస్థ ద్వారా రూ.25 లక్షల విరాళం అందించారని తెలిపారు. ముందుగా ట్రస్ట్ ప్రాంగణంలోని అవయవ తయారీ కేంద్రం, ట్రస్ట్ హాస్పటల్ ను ముఖ్య అతిధులు సందర్శించారు. అనంతరం 200 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు, చేతులు, చెవిటి మిషన్లు, వీల్ చైర్లు, అందులకు బ్లెయిండ్ స్టిక్స్ తదితర ఉపకారణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ ఫణీంద్ర, ట్రస్ట్సిబ్బంది సుకన్య టెక్నీషియన్లు, హాస్పిటల్ డాక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!