స్పష్టత ఇచ్చిన నిర్మాత దిల్ రాజు
జనవరి 10 (ఆంధ్రపత్రిక): సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల కావాల్సిన వారసుడు సినిమాను 14వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు దిల్ రాజు మీడియా ముందు తెరదించాడు. సంక్రాంతి వారసుడుగానే మా సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. చిరంజీవి,యు బాలకృష్ణల సినిమాలు ఉన్న కారణంగానే వారసుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు. పెద్ద హీరోలకు థియేటర్లు అసవరం కనుక ఆ సినిమాలు విడుదలయిన తరవాత 14న విడులకు నిర్ణయించామని అన్నారు. అయితే తమిళ వర్షన్ ను మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేశాడు. నేను గత కొన్ని రోజులుగా నా మనసులో ఈ విషయాన్ని అనుకుంటున్నాను. నా చుట్టు ఉన్న వారు.. నా ఆఫీస్ వారు ఈ విషయాన్ని రెండు మూడు రోజుల క్రితమే లీక్ చేశారు అంటూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశాడు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ పెద్ద హీరోలు. వారికి సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లు లభించాల్సి ఉంది. అందుకే వారి సినిమాల తర్వాతే నా సినిమా విడుదల కావాలనే ఉద్దేశ్యంతో జనవరి 14న నా వారసుడు సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. మా బ్యానర్ లో గతంలో వచ్చిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ మాదిరిగానే ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. కొందరు సినిమాను వాయిదా వేయాల్సిన అవసరం ఏంటీ.. అక్కడ 11 కు విడుదల అయ్యి.. ఇక్కడ 14కు విడుదల చేస్తే ఎలా అన్నారు. తప్పకుండా ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని దిల్ రాజు అన్నాడు. ఇది ఒక పాజిటివ్ నోడ్ తోనే చేస్తున్నట్లుగా దిల్ రాజు పేర్కొన్నాడు. అందరు నిర్మాతలు లాభపడాలి.. అందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలను దక్కించుకోవాలి అనే ఉద్దేశ్యంతో వారసుడు తెలుగు వర్షన్ ను మూడ్రోజులు వాయిదా వేస్తున్నామని అన్నారు.