గుంటూరు,డిసెంబర్ 26(ఆంధ్రపత్రిక): సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు వార్డ్ సచివాలయాల్లో అందే సేవల పై పూర్తి అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ సచివాలయ కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి సేవకు అందే అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ప్రతి కార్యదర్శి సిటిజన్ పర్సెప్షన్ సర్వే లక్ష్యాన్ని పూర్తి చేయాలని, స్వచ్చ సర్వేక్షణ్ 2023లో భాగంగా కార్యదర్శులు అందరూ సచివాలయం పరిధిలో హోం, క్లస్టర్ కంపోస్ట్ తయారి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సీజ్ చేయాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలన్నారు. అనంతరం కమిషనర్ గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ మూర్తి, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, ఎంహెచ్ఓ. డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!