డిసెంబర్ 24 (ఆంధ్రపత్రిక): సమంతా అనారోగ్యం కారణంగా ఒక్కో ప్రాజెక్ట్ చేజార్చుకుంటుందా? మరో నెల రోజుల్లో కోలుకోకపోతే మరిన్ని ప్రాజెక్ట్‌ల నుంచి ఉద్వాసన తప్పదా? అంటే అవుననే ప్రచారం బాలీవుడ్ విూడియాలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఈ రకమైన కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే వాటిని సమంత సన్నిహిత వర్గాలు ఖండిరచాయి. కానీ తాజా సన్నివేశం మరోలా కనిపిస్తుంది. ఇటీవలే సమంత నటించాల్సిన ’సీటాడెల్’ ఇండియన్ వెర్షన్ రెగ్యులర్ షూటింగ్ ప్రారభమైంది. ఈ విషయాన్నిఅమెజాన్ ప్రైమ్ ట్విటర్లో ప్రకటించింది. ఆ సంస్థ ఇచ్చిన జాబితాలోఎక్కడా సమంత పేరు కనిపించలేదు. వాస్తవానికి ఇందులో వరుణ్ ధావన్‌కి జోడీగా సమంత నటించాలి. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్ ఇది. అమ్మడికి ఫ్యామిలీ మ్యాన్`2 తర్వాత వచ్చిన వెబ్ అవకాశం కావడంతో! ఎంతో సంతోషంగా సంతకం చేసింది. కానీ తాజాగా అమెజాన్ ట్వీట్ చూసిన తర్వాత ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందని వార్తలొస్తున్నాయి. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవడంతో ఆమె స్థానంలోమరో హీరోయిన్ని తీసుకుని ముందుకెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సమంత తప్పుకుందని అధికారిక ప్రకటన లేనప్పటికీ సన్నివేశాలు అలాగే కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో మరో వార్త కూడా తెరపైకి వస్తుంది.బాలీవుడ్ లో సమంత నటించాల్సిన ఓ సినిమా నుంచి కూడా ఉద్వాసన ఎదురైనట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ జనవరిలో మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారుట. ఈ నేపథ్యంలో సమంత ఇప్పట్లో తమతో కలవడం కష్టమని భావించి సదరు సంస్థ ఆమెని తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు సమంత కోసం నిర్మాతలంతా వెయిట్ చేస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కానీ విూడియా కథనాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మరి సీటాడెల్ నుంచి తప్పుకుందా? తప్పించారా? అసలేం జరుగుతోంది అన్నది క్లారిటీ రావాలంటే సమంత లైన్లోకి రావాలి. జనవరి నుంచి ’ఖుషీ’ షూటింగ్‌కి హాజరవుతుందని మరోవైపు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!